హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

AP Global Investors Summit: గ్రాండ్ గా ప్రారంభమైన గ్లోబల్ సమ్మిట్.. ముఖేష్ అంబానీ సహా ప్రముఖుల రాకతో సరికొత్త కళ

AP Global Investors Summit: గ్రాండ్ గా ప్రారంభమైన గ్లోబల్ సమ్మిట్.. ముఖేష్ అంబానీ సహా ప్రముఖుల రాకతో సరికొత్త కళ

విశాఖకు చేరుకున్న ముఖేష్ అంబానీ

విశాఖకు చేరుకున్న ముఖేష్ అంబానీ

Global Investors Summit 2023: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ గ్రాండ్ గా ప్రారంభమైంది.. ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం ముఖేష్ అంబానీతో పాటు పలువురు దిగ్గజలు విశాఖకు చేరుకోవడంతో సరికొత్త కళ కనిపిస్తోంది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Visakhapatnam, India

AP Global Investor summit 2023: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh Government) చాలా ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ (AP Global Investors Summit) ఘనంగా ప్రారంభమైంది.ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి (Andhra Pradesh CM Jagan Mohan Reddy) జ్యోతిని వెలిగించి సదస్సును ప్రారంభించారు. అంతేకాదు జీఐఎస్‌ (GIS)లో ఏపీ రాష్ట్ర గీతం మా తెలుగు తల్లికి ఆలాపన చాలా ప్రత్యేకతంగా నిలిచింది. అలాగే లేజర్‌ షో అలరించింది. ఉదయానికి ఈ సమ్మిట్ కు పారిశ్రామిక దిగ్గజాలు చేరుకున్నారు. ప్రత్యేక కాన్వాయ్‌లో దిగ్గజ పారిశ్రామిక వేత్త ముఖేష్‌ అంబానీ (Mukesh Ambani) గ్లోబల్ సమ్మిట్ వేదిక దగ్గరకు చేరకున్నారు. ఆయనకు ఎంపీ విజయసాయిరెడ్డి (MP Vijayasaireddy), మంత్రులు గుడివాడ అమర్నాథ్‌ (Gudivada Amaranath), విడదల రజినీ (Vidala Rajani) ఇతర అధికారులు స్వాగతం పలికారు.

పారిశ్రామికవేత్తలు కరణ్‌ అదానీ, సంజీవ్‌ బజాజ్‌, నవీన్‌ జిందాల్‌, జీఎం రావు, జీఎంఆర్‌, ప్రీతారెడ్డిలు సైతం సభా వేదికకు చేరుకున్నారు. అలాగే యూకే డిప్యూటీ హైకమిషనర్‌ సైతం ఉదయాన్ని విశాఖకు వచ్చారు. పారిశ్రామిక దిగ్గజాల రాకతో ఆంధ్రా యూనివర్సిటీ గ్రౌండ్స్‌ ప్రాంగణం సరికొత్త కళ సంతరించుకుంది.

సమ్మిట్‌లో పాల్గొన్న ముఖేష్ అంబానీ ఇందులో భాగమైనందుకు సంతోషంగా ఉంది అన్నారు. పలు రంగాల్లో ఏపీ నంబర్‌వన్‌గా మారుతున్నందుకు శుభాకాంక్షలు తెలిపారు.. నూతన భారతదేశ నిర్మాణంలో ఆంధ్రప్రదేశ్ ఎంతో కీలకం కాబోతోంది. ఏపీలో జియో నెట్‌వర్క్‌ అభివృద్ధి చెందింది. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ప్రగతికి ఏపీ సర్కార్‌ మంచి సహకారం అందిస్తోంది. ఏపీలో వనరులు పుష్కలంగా ఉన్నాయని.. పలువురు అంతర్జాతీయ స్థాయి నిపుణులు ఈ రాష్ట్రం నుంచే ఉన్నారన్నారు. సుదీర్ఘ తీర ప్రాంతం ఉన్న రెండో స్టేట్‌ ఆంధ్రప్రదేశ్ అన్నారు. సీఎం జగన్‌ సమర్థవంతమైన నాయకత్వంలో ఏపీ వేగంగా అభివృద్ధి చెందుతోందని అభిప్రాయపడ్డారు. ఈ సందర్బంగానే ఏపీలో పెట్టుబడులను ప్రకటించారు. ఏపీలో 10 గిగావాట్ల సోలార్‌ ఎనర్జీ ప్లాంట్‌ ఏర్పాటు చేయబోతున్నట్టు తెలిపారు.

ఇదీ చదవండి : జనసేన ఆవిర్భావ సభకు ఏర్పాట్లు.. వారాహిపైనే వేదిక దగ్గరకు పవన్.. యాత్ర ఎప్పటి నుంచి అంటే..?

అదానీ పోర్ట్స్‌ సీఈవో కరణ్‌ అదానీ మాట్లాడుతూ.. ఏపీలో గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌లో పాల్గొనడంపై ఆనందం వ్యక్తం చేశారు. ఏపీలో మౌలిక సదుపాయాలు బాగున్నాయి. ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు ఏపీ కనెక్టివిటీ బాగుంది. ఒబెరాయ్‌ హోటల్స్‌ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌ అర్జున్‌ బబెరాల్‌ మాట్లాడుతూ.. ఏపీలో పర్యాటక రంగం అంతర్జాతీయ స్థాయిలో ఉంది. ఏపీ పర్యాటక విధానం ఉత్తమంగా ఉంది. పర్యాటక రంగంలో ప్రీమియర్‌ డెస్టినేషన్‌గా ఏపీ ఉందని ఆదాని కొనియాడారు.

First published:

Tags: Andhra Pradesh, Ap cm jagan, AP News, Mukesh Ambani, Visakhapatnam

ఉత్తమ కథలు