Home /News /andhra-pradesh /

GAS LEAKAGE FROM CHEMICAL INDUSTRY IN KAKINADA EAST GODAVARI DISTRICT

మళ్లీ గ్యాస్ లీకేజీ కలకలం.. వణికిపోతున్న ప్రజలు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

టెకీ రసాయన పరిశ్రమ నుంచి గ్యాస్ లీకయ్యింది. రసాయన పరిశ్రమ నుంచి గ్యాస్ లీకయ్యిందనే సమాచారం అందగానే స్థానిక అధికారులు, పోలీసులు అప్రమత్తమయ్యారు.

    విశాఖ గ్యాస్ లీకేజీ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఆ ఘటన తాలూకు మరకలు ఇంకా ఆరిపోనే లేదు. అప్పట్నుంచి గ్యాస్ లీకేజీ పేరు వింటేనే ప్రజలు వణికిపోతున్నారు. అది తల్చుకుంటేనే... ఇప్పటికి ప్రజలకు నిద్ర కరువవుతోంది. విశాఖలోని ఎల్‌జీ పాలిమర్స్ కంపెనీలో రాత్రి సమయంలో గ్యాస్ లీక్ కావడంతో వందలాది మంది ప్రజలు అస్వస్థతకు గురయ్యారు. కొంతమంది ప్రాణాలొదిలారు. ఆ ఘటన మిగిల్చిన నష్టం అంతా ఇంతా కాదు. ఇదిలావుంటే.. తాజగా తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడలో గ్యాస్ లీకేజీ కలకలం సృష్టించింది. కాకినాడ గ్రామీణ మండలం సర్పవరంలోని టెకీ రసాయన పరిశ్రమ నుంచి గ్యాస్ లీకయ్యింది. రసాయన పరిశ్రమ నుంచి గ్యాస్ లీకయ్యిందనే సమాచారం అందగానే స్థానిక అధికారులు, పోలీసులు అప్రమత్తమయ్యారు.
    Published by:Narsimha Badhini
    First published:

    Tags: Andhra Pradesh, East godavari, Gas leak

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు