హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Andhra Pradesh: 8 గంటల్లోనే ఆరోగ్యశ్రీ కార్డు.., గ్రామ సచివాలయం రికార్డు..,

Andhra Pradesh: 8 గంటల్లోనే ఆరోగ్యశ్రీ కార్డు.., గ్రామ సచివాలయం రికార్డు..,

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh Government) ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న గ్రామ సచివాలయ వ్యవస్థ ప్రజల పాలిట వరంగా మారింది. ప్రభుత్వ సేవలు నిర్ణీత సమయంలో అందించించేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (CM YS JaganmohanReddy) తీసుకున్న నిర్ణయం సత్ఫలితాలనిస్తోంది.

ఇంకా చదవండి ...

  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న గ్రామ సచివాలయ వ్యవస్థ ప్రజల పాలిట వరంగా మారింది. ప్రభుత్వ సేవలు నిర్ణీత సమయంలో అందించించేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం సత్ఫలితాలనిస్తోంది. ప్రసవం కోసం ఆస్పత్రిలో చేరిన గర్భిణీకి కేవలం 8గంటల్లోనే ఆరోగ్య శ్రీ కార్డు మంజూరైంది. అర్ధరాత్రి సమయంలో సచివాలయ సిబ్బంది మహిళకు కార్డు అందజేసింది. వివరాల్లోకి వెళ్తే.., విజయనగరం జిల్లా తెర్లాం మండలం విజయరాంపురం గ్రామానికి చెందిన పైల ధనలక్ష్మి ప్రసవం కోసం శ్రీకాకుళం జిల్లా రాజాంలోని కేర్‌ ఆస్పత్రిలో చేరింది. ఐతే ఆస్పత్రిలో ప్రసవం చేసేందుకు ఆరోగ్యశ్రీ కార్డు అవసరమని డాక్టర్లు చెప్పారు. ఐతే ఆమెకు ఆరోగ్యశ్రీ కార్డు లేకపోవడంతో కుటుంబ సభ్యులు విజయరాంపురం గ్రామ సచివాలయంలో సంప్రదించారు.

  సకాలంలో స్పందించిన సచివాలయ సిబ్బంది ధనలక్ష్మి కుటుంబ సభ్యులతో అప్పటికప్పుడు దరఖాస్తు చేయించారు. అనంతరం ఆమె పరిస్థితి గురించి ఉన్నతాధికారులకు వివరించారు. అనంతరం డిజిటల్ అసిస్టెంట్ రామ్మోహన్.., రికార్డు స్థాయిలో కేవలం 8గంటల్లోనే ఆరోగ్యశ్రీ కార్డును మంజూరు చేయడమే కాకుండా.. ప్రింట్ చేసి రాత్రి 11గంటల సమయంలో రాజాంలోని కేర్ ఆస్పత్రికి వెళ్లి అందజేశారు. దీంతో డాక్టర్లు ఆమెకు ప్రసవం చేశారు. అత్యవసర సమయంలో ఆరోగ్యశ్రీ కార్డు ముంజూరు చేసి తమను ఆదుకున్న గ్రామ సచివాలయ అధికారులకు ధనలక్ష్మి, ఆమె బంధువులు కృతజ్ఞతలు తెలిపారు.

  రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన గ్రామ వలంటీర్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ ఎక్స్ ప్రెస్ వేగంతో పనిచేస్తూ ప్రజలకు ప్రభుత్వ పథకాలను అందజేస్తోంది. ఇటీవల శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలంలోని ఓండ్రోజోల గ్రామానికి గ్రామ వాలంటీర్ బరాటం నరసింగరావు క్యాన్సర్ తో బాధపడుతున్న బాలికకు ఆరోగ్య శ్రీ వర్తింపజేసేందుకు ఏకంగా 1200 కిలోమీటర్లు ప్రయాణించి బెంగళూరు వెళ్లి చిన్నారితో పాటు తల్లిదండ్రులతో ఈ-కేవైసీ చేయించాడు. అనంతరం నాలుగు రోజుల్లోనే ఆరోగ్య శ్రీకార్డు మంజూరు చేయడంతో పాపకు వైద్యం అందుతోంది. చిన్నారి ఆరోగ్యం కోసం ఇంతలా కష్టపడిన నరసింగరావును గ్రామస్తులు అభినందించారు. గతంలో గంటల వ్యవధిలో గ్రామ సచివాలయాలు గంటల వ్యవధిలోనే రేషన్ కార్డులు మంజూరుచేసి రికార్డ్ సృష్టించాయి. ప్రభుత్వం ప్రజలకు అందిచే సేవలకు నిర్ణీత సమయాన్ని ఖరారు చేయడంతో ప్రజలు నెలల తరబడి కార్యాలయాల చుట్టూ తిరిగే శ్రమ తప్పినట్లయింది.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Aarogyasri, Andhra Pradesh, Andhra pradesh news, Ap grama sachivalayam, Gram volunteer, Srikakulam, Village secretariat, Ward Volunteers

  ఉత్తమ కథలు