రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయం వేడెక్కింది. తెలంగాణలో కేసీఆర్ కొత్త జాతీయ పార్టీ, మునుగోడు బై ఎలెక్షన్స్, ఏపీలో మూడు రాజధానుల అంశంతో పాలిటిక్స్ రసవత్తరంగా మారాయి. ఇక తాజాగా మెగాస్టార్ చిరంజీవితో (Megastar chiranjeevi) టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ హైదరాబాద్ లో భేటీ ఇప్పుడు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే తాజాగా చిరు నటించిన గాడ్ ఫాదర్ సినిమా దసరా సందర్బంగా రిలీజ్ అయి హిట్ టాక్ తో దూసుకుపోతుంది. ఈ క్రమంలోనే చిరుకు అభినందనలు చెప్పేందుకే కలిశారని గంటా వర్గం చెబుతుంది. అయితే ఈ భేటీలో తాజా రాజకీయాలపై చర్చించినట్లు సమాచారం.
కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి Megastar chiranjeevi 'గాడ్ ఫాదర్' సినిమాతో మళ్లీ రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. నేను రాజకీయానికి దూరంగా ఉన్నాను. నానుండి రాజకీయం దూరం కాలేదంటూ చెప్పిన డైలాగ్ నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఇటీవల గాడ్ ఫాదర్ మూవీ ప్రమోషన్ లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో తన తమ్ముడు జనసేన అధినేత, హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు మద్దతు ఇస్తానేమో అంటూ చెప్పుకొచ్చారు. ఈ వ్యాఖ్యలతో మెగాస్టార్ జనసేనలో చేరబోతున్నారని వార్తలు వచ్చాయి. ఇన్నిరోజులుగా సైలెంట్ గా ఉన్న చిరు Megastar chiranjeevi రాజకీయాల్లో మళ్లీ చురుకుగా ఉండబోతున్నారని తెలుస్తుంది.
ఈ కాక చల్లారకముందే ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ తో భేటీ రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. చిరంజీవి Megastar chiranjeevi ఏర్పాటు చేసిన ప్రజారాజ్యం పార్టీలో కీలక పాత్ర పోషించారు. అనంతరం ప్రజారాజ్యం కాంగ్రెస్ లో విలీనం కావడంతో కాంగ్రెస్ లో చేరారు. అనంతరం తెలుగుదేశం పార్టీలో చేరి ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే గంటా పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనడం లేదు. రాజకీయాలకు అతీతంగా చిరు, గంటా సంబంధాలు కొనసాగిస్తున్నారు. టీడీపీలో అంతగా యాక్టివ్ లేని గంటా చిరంజీవితో Megastar chiranjeevi భేటీ అవ్వడం అనేక చర్చలకు తావిస్తోంది.
చిరు తమ్ముడు పవన్ కు సపోర్ట్ ఇస్తానేమో అన్న వ్యాఖ్యలతో తాజా భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. మరి ఈ భేటీలో రాజకీయ అంశాలపై చర్చించారా? గంటా ఫ్యూచర్ లో ఎలాంటి స్టెప్ తీసుకోబోతున్నారో ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరి టీడీపీతో ఆంటీముంటనట్టుగా ఉన్న గంటా శ్రీనివాస్ చిరుతో భేటీ అవ్వడంపై అనేక చర్చలు జోరందుకున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Megastar Chiranjeevi