ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. తాజాగా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్‌కి కరోనా బారినపడ్డారు. శనివారం నిర్వహించిన పరీక్షలలో ఆయన కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో ఆయనను 14 రోజులు హోం క్వారంటైన్లోకి ఉండాల్సిందిగా వైద్యులు సూచించారు. దీంతో ఆయనను గత కొద్ది రోజులుగా కలిసివారిలో ఆందోళన నెలకొంది. మరోవైపు కరోనా మహమ్మారి కేసులు తగ్గుముఖం పట్టినప్పటికీ.. ఎప్పుడు ఎవరికి కరోనా సోకుతుందా అనే భయం ప్రజల్లో నెలకొంది. ఇప్పటికే ఏపీలో పలువురు ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా కరోనా బారినపడిన సంగతి తెలిసిందే.
ఇక, ఏపీలో కరోనా కేసుల సంఖ్య 8లక్షలు దాటింది. శుక్రవారం విడుదల చేసిన బులెటిన్‌లో కొత్తగా 3,765 మంది కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కరోనా వైరస్ కేసులు 8,00,684కు చేరుకున్నాయి. ఇప్పటివరకు 74.28లక్షల టెస్టులు చేశామని ఆరోగ్య శాఖ వెల్లడించింది. తాజాగా కరోనాను జయించిన 4,281 మంది వివిధ ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దీంతో కొవిడ్ నుంచి కోలుకున్నవాళ్ల సంఖ్య 7,62,419కు పెరిగింది. ప్రస్తుతం ఏపీలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 31,771గా ఉంది.
ఇక, గత ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలుపొందిన వంశీ ప్రస్తుతం వైసీపీకి మద్దుతిస్తున్న సంగతి తెలిసిందే. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొడాలి నాని చక్రం తప్పి వంశీని వైసీపీ గూటికి చేర్చారు. అధికారికంగా వైసీపీ కండువా కప్పుకోకపోయినా వంశీ వైసీపీకే మద్దతిస్తున్నారు. అసెంబ్లీలో కూడా ఆయనకు ప్రత్యేకంగా సీటు కేటాయించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Coronavirus, Vallabaneni Vamsi