Gudivada Casino: కృష్ణా జిల్లా (Krishna District) గుడివాడ (Gudivada) లో మంత్రి కొడాలి నాని (Minister Kodali Nani) కి చెందిన కన్వెన్షన్ సెంటర్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అవుతోంది. అక్కడే మంత్రి కను సన్నల్లోనే క్యాసినో నిర్వహించారని.. టీడీపీ (TDP) పదే పదే అరోపిస్తోంది. అయితే దానికి ధీుగా మంత్రి స్పందిస్తున్నారు. అక్కడ క్యాసినో నిర్వహించినట్టు నిరూపిస్తే పెట్రోల్ పోసుకుని తగలబెట్టుకునేందుకు కూడా సిద్ధం అంటున్నారు. దమ్ముంటే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడే స్వయంగా వచ్చి పరిశీలించుకోవచ్చు అంటున్నారు. తనకు స్థానిక కుల నేతలకు ఉన్న సమయంను.. పెద్దదిగా చేసే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. అయితే తాజాగా ఈ ఘటనపై ఆయన సన్నిహితుడు ఎమ్మెల్యే వల్ల భనేని వంశీ చేసిన వ్యాఖ్యలు మరింత సంచలనం అవుతున్నాయి.
సంక్రాంతి పండుగ అంటే ప్రతి ఏడాది మాదిరిగానే కోడి పందాలు, పేకాట శిబిరలాంటివి నిర్వహించడం కామన్ అన్నారు. ఇప్పుడే కాదు టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా అవి నిర్వహించామని చెప్పారు. పార్టీ ఏదైనా అధికారంలో ఉన్నవారికి వీటి గురించి తెలిసినా చూసి చూడనట్టు వెళ్లిపోవడం ఆనవాయితీగా వస్తోంది అన్నారు. అలాంటివే గుడివాడాలోనూ జరిగాయని.. అక్కడ క్యాసినో నిర్వహణ జరగలేదున్నారు.
Gudivada Casino || గోవాను మించిన వినోదం || మంత్రి ఇలాకాలో క్యాసినో చూస్త... https://t.co/ZNMMrB9clN via @YouTube #casino #casinoonline #TDP @MahithaGudivada @kodalinnani
— nagesh paina (@PainaNagesh) January 21, 2022
కొడాలి నాని అనారోగ్యంతో ఉండటంతో నా స్నేహితులు శిబిరం నిర్వహించిన మాట వాస్తవమేనని ఆయన అన్నారు. శిబిరం నిర్వహించిన వారు తన స్నేహితులు, వారు ఎవరో కూడా కొడాలి నానికి తెలియదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అది క్యాసినో, క్యాబేరోనే కాదని.. చిన్న విషయాన్ని టీడీపీ రాద్దాంతం చేస్తోంది అన్నారు. టీడీపీ హయాంలో తాము పనిచేసామని.. అప్పుడు నిర్వహించిన శిబిరాలే ఇప్పుడు జరిగాయని ఆయన స్పష్టం చేశారు.
ఇదీ చదవండి : నెల్లూరు అడవుల్లో ‘పుష్ప’ సీన్ .. చివరికి ఏం జరిగింది అంటే..?
తెలుగుదేశం పార్టీ నేతలు చెబుతున్నట్టు కె. కన్వీన్షన్ లో కాదు దాని పక్కన లే అవుట్ ఏర్పాటు చేస్తున్న స్థలంలో జరిగాయని, రాజకీయ లబ్ది కోసమే టీడీపీ నిజ నిర్ధారణ కమిటీ పేరుతో నానా యాగీ చేస్తోందని వల్లభనేని వంశీ ఆరోపించారు. అమ్మాయిల డ్యాన్సుల్లో అర్ద నగ్న దృశ్యాలు అక్కడ జరగలేదన్నారు. పోలీసుల విచారణలో అన్నీ విషయాలు తెలుస్తాయని, తాము విమర్శలు చేస్తే విలవిలలాడే చంద్రబాబు మాపై మాత్రం అసత్య ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. టీడీపీ అధికారిక వెబ్ సైట్స్ లో కొడాలి నాని, నా పై పోస్టింగులు పెట్టిస్తున్నారని, కొడాలి నాని, తాను టీడీపీ, చంద్రబాబుపై విమర్శలు చేస్తున్నామనే ఈ దాడి జరుగుతోందని అన్నారు.
ఇదీ చదవండి : ఆ రెండు జిల్లాల్లో వ్యాప్తికి కారణం అదే.. ఇకపై కఠిన ఆంక్షలు అమలు
కొడాలి నాని విమర్శలను ఎదుర్కోలేక ఇలా లేని పోని అసత్య ఆరోపణలను టీడీపీ చేస్తోందని.. ఇదంతా చంద్రబాబు నాయుడి డైరక్షన్ లో జరుగుతున్న నాటకం అంటూ వల్లభనేని వంశీ కొట్టి పడేశారు..
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Kodali Nani, Vallabhaneni vamsi