Home /News /andhra-pradesh /

GANJNA GANG FROM ANDHRA PRADESH FROME VISKHA TO MADHYAPRADES VIA AMAZON DELIVERY NGS VSP

Visakha Ganja: కరివేపాకు పేరుతో అమెజాన్‌లో గంజాయి దందా.. విశాఖ టు మధ్య ప్రదేశ్ వయా అమెజాన్..

అమజాన్ లో గంజాయి సేల్స్

అమజాన్ లో గంజాయి సేల్స్

Ganja gang in Visakha: ఆంధప్రదేశ్ లో గంజాయి గ్యాంగ్ పోలీసులకు సవాల్ విసురుతోంది. ముఖ్యంగా విశాఖ ఏజెన్సీ నుంచి మొన్నటి వరకు ఇతర రాష్ట్రాలకు సరఫారా అయ్యేది. కానీ ఇఫ్పుడు పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ఈ కామర్స్ సంస్థల ద్వారా విక్రయాలు సాగిస్తుండడం కలకలం రేపుతోంది.

ఇంకా చదవండి ...
  Ganja sales in Amazon:  గంజాయి గ్యాంగ్ (Ganja Gang) అరాచకాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. ఏపీలో గంజాయి సరఫరా పై భారీగా విమర్శలు వస్తున్నాయి.  ఏపీ ప్రభుత్వాన్ని (AP Government) విపక్షాలు పదే పదే విమర్శిస్తున్నారు. ఇక గంజాయి సరఫరా ఏ రాష్ట్రంలో బయట పడ్డా.. లింకులు ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) తో ఉంటున్నాయి. గంజాయి అక్రమ రవాణ ఎక్కడ దొరికినా.. దాని మూలాలు ఆంధ్రప్రదేశ్ లోనే బయటపడుతున్నాయి.  ఇప్పటి వరకు పోలీసుల కళ్లు కప్పి.. దొంగచాటుగా గంజాయిని తరలిస్తూ వస్తున్నారు మాపియా గాళ్లు.. కానీ గత కొన్ని రోజుల నుంచి నిఘా ఎక్కువ అవ్వడం.. ఎక్కడికక్కడ అక్రమరావాణాను అడ్డుకోవడంతో వారు రూటు మార్చారు. నేరుగా ఆన్ లైన్ విక్రయ సంస్థలను టార్గెట్ చేశారు.. ఎవరికీ అనుమానం రాకుండా ఇతర ప్రొడక్ట్స్ పేరుతో అమ్మకాలు మొదలెట్టారు.

  ముఖ్యంగా విశాఖపట్నం ఏజెన్సీ (Viskhapatnam Agency) నుంచి భారీగా అక్రమంగా గంజాయి రవాణా అవుతోంది. ఇటీవల అమెజాన్ ద్వారా కొందరికి గంజాయి అందడంతో పోలీసులు.. విచారించంగా మధ్య ప్రదేశ్ లోని గ్వాలియర్ లో కొందర్ని అరెస్ట్ చేశారు. వారిని విచారించగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి..

  ఇదీ చదవండి : టాలీవుడ్ కు మోహన్ బాబు పెదరాయుడు అవుతారా..? సీఎం జగన్ తో ఏం మాట్లాడనున్నారు..?

  అమెజాన్‌ లో గంజాయి పార్సిల్స్ చేస్తున్నకేసుకు సంబంధించి విశాఖ పోలీసులు ఐదుగురిని అరెస్ట్‌ చేశారు. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ కేంద్రంగా ఆర్డర్లు పెడితే.. విశాఖలోని కంచరపాలెం నుంచి పార్సిల్స్‌ వెళ్లేవి. గ్వాలియర్‌లో ఇద్దరి అరెస్టుతో ఆన్‌లైన్ గంజాయి దందా వెలుగుచూసింది. అయితే గత ఆరేడు నెలలుగా గంజాయి పార్సిల్స్‌ అమెజాన్‌లో వెళ్లినట్లు గుర్తించామన్నారు స్పెషల్‌ ఎన్‌ఫోర్స్ మెంట్‌ బ్యూరో జాయింట్ డైరెక్టర్‌ సతీష్‌కుమార్. సూపర్ నేచురల్‌ స్టీవియా లీవ్స్‌ పేరుతో (కరివేపాకు) అమెజాన్‌లో సెల్లర్‌గా రిజిస్టర్‌ అయిన జేస్వల్, భవయ్య…విశాఖకు చెందిన చిలకపర్తి శ్రీనివాసరావు స్టాక్‌ పాయింట్‌ ఇచ్చారు.

  ఇదీ చదవండి : చంద్రబాబును అంతమాట అంటారా..? ఏపీ సర్కార్ కు ఉండవల్లి హెచ్చరిక..

  జేస్వల్‌, భవయ్యను మధ్యప్రదేశ్‌ పోలీసులు అరెస్ట్‌ చేసి విచారించగా..విశాఖకు చెందిన చిలకపర్తి శ్రీనివాసరావు తమకు గంజాయి పంపిస్తున్నట్లు చెప్పారు. ఈ నెల 21న వాహనాలు తనిఖీలు చేస్తుండగా శ్రీనివాస్‌ పట్టుబడ్డారని.. అయితే మధ్యప్రదేశ్‌ పోలీసులు ఇచ్చిన సమాచారంతో అతడి ఇంట్లో తనిఖీలు చేస్తే అమెజాన్ ప్యాకింగ్‌ సామాగ్రితో పాటు గంజాయి లభించిందన్నారు. ఈ కేసులో శ్రీనివాస్‌తో పాటు విశాఖకు చెందిన అమెజాన్‌ పార్సిల్స్ పికప్ బాయ్స్‌ కుమారస్వామి, కృష్ణంరాజు, డ్రైవర్‌ వెంకటేశ్వరరావును ఇప్పటికే అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న శ్రీనివాస్‌ తనయుడు మోహన్‌రాజును కూడా అరెస్ట్‌ చేసింది స్పెషల్‌ ఎన్‌ఫోర్స్ మెంట్‌ బ్యూరో.

  ఇదీ చదవండి : ఏపీ ప్రభుత్వం పై సురేష్ బాబు సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

  గతంలోనే నిందితుడుపై కేసులు ఉన్నాయి అన్నారు. శ్రీనివాస్‌పై 2007లో గంజాయి కేసు ఉందని.. అలాగే ఇప్పటివరకు ఆరు వందల నుంచి ఏడు వందల కేజీల గంజాయిని స్మగ్లింగ్ చేసినట్టు తెలుస్తోంది అన్నారు. ఈ కేసులో అమెజాన్‌ సంస్థకు నోటీసులు ఇచ్చారు స్పెషల్‌ ఎన్‌ఫోర్స్ మెంట్‌ బ్యూరో పోలీసులు. మెటీరియల్ చెక్‌ చేయకుండా పార్సిల్‌ తీసుకోవడంపై వివరణ కోరతామన్నారు.

  (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Ganja case, Smuggling, Visakhapatnam, Vizag

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు