పవిత్ర తులసి క్షేత్రమైన తిరుమల పుణ్యక్షేత్రంను గంజాయి క్షేత్రంగా మారుస్తున్నారని బిజేపి రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి ఆరోపించారు. ఆదివారం ఉదయం స్వామి వారి నైవేద్య విరామ సమయంలో భాను ప్రకాష్ రెడ్డి స్వామి వారి సేవలో పాల్గోని మొక్కులు చెల్లించుకున్నారు.. దర్శనంతరం ఆలయ వెలుపలకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కలియుగ వైకుంఠంమైన తిరుమలలో గంజాయి పట్టుబడడంతో భక్తులు మనోభావాలు దెబ్బతింటున్నాయని ఆయన చెప్పారు.
నాలుగు అంచేల భద్రతంటూ, తిరుమల భద్రతని గాలికి వదిలేశారని, టిటిడి భద్రతా వ్యవస్థ పూర్తిగా వైఫల్యం చేందిందన్నారు.. టిటిడి విజిలెన్స్ సిబ్బంది తనిఖీల్లో పట్టుబట్టకుండా తిరుమలకి నిషేధిత వస్తువులు యదేచ్చగా వస్తుందని, టిటిడిలో కొందరు అధికారులు మామూలకు అలవాటు పడి చూసి చూడనట్లు వ్యవహరిస్తుండడంతో ఇలా గంజాయి తిరుమలకు వస్తుందన్నారు. అయితే తిరుమలకు గంజాయి అక్రమ రవాణాపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
గంజాయి అక్రమ రవాణాపై ఏపి ఛీఫ్ సెక్రెటరీకి, డిజీపికి లేఖ ద్వారా ఫిర్యాదు చేసి తెలియజేస్తాంమని బిజేపి రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి అన్నారు. శ్రీవారి దర్శనార్థం నిత్యం వేలాది మంది వచ్చే తిరుమల పవిత్రతను దృష్టిలో పెట్టుకుని టీటీడీ కొన్నేళ్ల కిందటే మద్యం, మాంసం, సిగరెట్, గుట్కా ఇతర పొగాకు ఉత్పత్తులను నిషేధించింది. వాటితో తిరుమలకు రానీయకుండా అలిపిరిలోనే తనిఖీ చేసేలా చర్యలు తీసుకుంటోంది. అయితే ఎన్నిరకాల తనిఖీలు చేపడుతున్నప్పటికీ నిషేధిత ఉత్పత్తులు తరచూ కొండపై కనిపిస్తూనే ఉన్నాయి. వీటన్నింటినీ పక్కన పెడితే తాజాగా గంజాయి కూడా తిరుమలకు రావడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
ఈ ఏడాది ఫిబ్రవరి 24న తిరుమల జీఎన్సీ టోల్గేట్ వద్ద ఓ కూరగాయల వాహనంలో 200 గ్రాముల గంజాయిని ఎస్ఈబీ, విజిలెన్స్ గుర్తించింది. ఆ వాహనాన్ని సీజ్ చేయడంతో పాటు గంజాయిని స్వాధీనం చేసుకుని ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఈ ఘటన మరువకముందే శుక్రవారం వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని లగేజీ కౌంటర్లో పనిచేసే మరో వ్యక్తి వద్ద నుంచి 150 గ్రాముల గంజాయి ప్యాకెట్లను భద్రతా సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. వరుసగా ఇలా చోటు చేసుకుంటున్న ఘటనలతో తిరుమలలో కలకలం రేపుతోంది. భక్తులు ఇలాంటి ఘటనలపై తీవ్ర ఆవేదన.. ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ganja smuggling, Local News, Tirumala, Tirumala Temple