GANJA GANG MOVIE STYLE ESCAPE FROM POLICE BUT FINALLY THEY CATCHES BY VISAKHA POLICE NGS
Ganj Gang: సినిమా స్టైల్లో ఛేజింగ్.. ఏపీలో మహారాష్ట్ర గంజాయి ముఠా బీభత్సం..
గంజాయి గ్యాంగ్ బీభత్సం
Ganj Gang: యదార్ధ ఘటనలకు కాస్త మసలా వేసి దర్శకులు సినిమాలు తీస్తుంటే.. కొంతమంది ఆ సినిమాలో హీరోలు, విలన్లను ఫాలో అయిపోతూ ఫీట్లు చేస్తున్నారు. ఇటీవల హీరోలో నెగిటివ్ షేడ్స్ సినిమాలు చేస్తుండడం.. వారి ప్రేరణగా క్రైమ్ చేస్తున్నారు. తాజాగా విశాఖపట్నంలో గంజాయి గ్యాంగ్ ముఠా బీభత్సం చేసింది. పోలీసులను పరుగులు పెట్టించింది..
Ganj Gang: గంజాయి గ్యాంగ్ (Ganja Gang) అరాచకాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. గత కొంతంగా ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని గంజాయి సరఫరా రోజు రోజుకూ పెరుగుతూ వస్తోంది. పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినా.. ఉక్కు పాదం మోపినా.. గంజాయి సరఫరాకు అడ్డుకట్ట పడడం లేదు. తీవ విమర్శల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం(AP Government) ఎన్ని ప్రయాత్నాలు చేసినా.. సరఫరా నిరంతరం కొనసాగుతోంది. గంజాయి సరఫరా ఏ రాష్ట్రంలో బయట పడ్డా.. లింకులు ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) తో ఉంటున్నాయి. అది కూడా మ ముఖ్యంగా విశాఖపట్నం ఏజెన్సీ (Viskhapatnam Agency) నుంచి భారీగా అక్రమంగా గంజాయి రవాణా అవుతోంది. తాజాగా విశాఖ జిల్లాలో జరిగిన మరో ఘటన ఏపీలో గంజాయి గ్యాంగ్ తీవ్రను తెలిసేలా చేసింది.
తాజాగా విశాఖపట్నం జిల్లా నర్సీపట్నంలో మహారాష్ట్ర గంజాయి ముఠా బీభత్సం సృష్టించింది. గత కొంతకాలంగా గుట్టు చప్పుడు కాకుండా సాగిపోతున్న గంజాయి సరఫరాపై సమాచారం అందడంతో.. పోలీసులు రంగంలోకి దిగారు. గంజాయి ముఠా అనే అనుమానంతో కారును ట్రాఫిక్ ఎస్సై, పోలీసులు వెంబడించారు. అయితే వారిని తప్పించుకునే క్రమంలో గంజాయి ముఠా కారు ఓ ఆటోని ఢీకొట్టింది. ఆ మార్గంలో పలు వాహనాలు వెళ్తున్నా పట్టించుకోకుండా.. సినిమా స్టైల్లో వాహనాలను అన్నింటికీ ఢీ కొడుతూ స్వీడ్ గా ఓవర్ టేక్ చేస్తూ ముందుకు వెళ్లంది గంజాయి గ్యాంగ్.. దీంతో పలు వాహనాలు ధ్వంసం అయ్యాయి.
మరోవైపు పోలీసులు కూడా పట్టు వదల గంజాయి గ్యాంగ్ ను వెంటబడడ్డారు. ఎంత దూరం వెళ్తున్న పోలీసులు వెంటపడుతుండడంతో ఇక తప్పించుకోలమేని గంజాయి గ్యాంగ్ ముఠా నిర్ణయానికి వచ్చింది. దీంతో కొంతదూరం వెళ్లాక కారును అక్కడ విడిచిపెట్టేశారు. ఎవరికీ అనుమానం రాకుండా ఆ తర్వాత ఇద్దరు నిందితులు సమీపంలోని పెదబొడ్డేపల్లి పెద్ద చెరువులో దూకేయగా.. మరో నిందితుడి అక్కడి నుంచి పరారయ్యాడు. దీంతో పోలీసులు చెరువును చుట్టుముట్టి ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పరారైన నిందితుడి కోసం పోలీసులు గాలింపు చేపట్టడంతో అతడు చిక్కాడు. నిందితులు ముగ్గురినీ అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
అయితే ఇటీవల సినిమా స్టైల్ ఘటనలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా సినిమాల్లో హీరోలే విలన్లుగా. నెగిటివ్ షేడ్స్ లో నటిస్తుండడంతో.. కొందరు యువకులు ఇా తమను తాను హీరోలు ఊహించుకుని పోలీసులనే ఆట పట్టించాలి అనుకుంటున్నారు. నిన్న నెల్లూరు అడవుల్లో పుష్ష సినిమా స్టైల్లో ఎర్రచందనం స్మగ్లర్లు.. పోలీసులపై గొడ్డల్లు, కర్రలతో దాడి చేస్తే.. ఇవా విశాఖపట్నం జిల్లాలోని గంజాయి స్మగ్లర్లు.. సినిమా స్టైల్లో ప్రధాన రహదారిపై వాహనాలను ఢీ కొడుతూ.. పోలీసులను పరుగులు పెట్టించారు. ఈ ముఠాది మహారాష్ట్ర వారిగా గుర్తించారు
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
Published by:Nagabushan Paina
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.