Home /News /andhra-pradesh /

GANG WAR IN GUNTUR TWO GROUPS FIGHT FOR A GIRL SK

గుంటూరులో గ్యాంగ్ వార్.. యువతి కోసం కొట్టుకున్న యువకులు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

గ్రౌండ్‌లో యువకులు ఉన్నారని సమాచారం మేరకు అరుండల్ పేట పోలీసులు మెరుపుదాడి చేశారు. ఇరువర్గాల యువకులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

    బెజవాడ ఘటన మరువక ముందే గుంటూరులో మరో గ్యాంగ్ వార్ తీవ్ర కలకలం రేపింది. ఓ యువతి విషయంలో ఇరువర్గాల యువకుల మధ్య వివాదం తెలెత్తింది. రాత్రి సమయంలో ఓ గ్రౌండ్ వేదికగా మాట్లాడుకుందాం రమ్మంటూ బాహాబహికి దిగారు యువకులు. గ్రౌండ్‌లో యువకులు ఉన్నారని సమాచారం మేరకు అరుండల్ పేట పోలీసులు మెరుపుదాడి చేశారు. ఇరువర్గాల యువకులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఆ విద్యార్థులంతా నగర శివారులోని ప్రముఖ ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతున్న బిటెక్ చదువుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

    కాగా, ఇటీవల విజయవాడలోని పటమటలో గ్యాంగ్ వార్ జరిగిన విషయం తెలిసిందే. సందీప్, పండు గ్యాంగ్‌లకు చెందిన యువకులు పరస్పరం కొట్టుకున్నారు. ఈ ఘటనలో సందీప్ చనిపోయాడు. ఘటనపై దర్యాప్తు చేస్తున్న పోలీసులు ఇప్పటికే 13 మందిని అరెస్ట్ చేశారు. కౌంటరు కేసులో తాజాగా మరో 11 మందిని అరెస్టు చేశారు. ఇందులో రాజకీయాలకు సంబంధం లేదని.. భూతగదాలే గ్యాంగ్ వార్‌కు కారణమని చెప్పారు.

    గ్యాంగ్ వార్‌లో ఓ వ్యక్తి చనిపోయిన విషయం తెలిసిందే.
    .
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Andhra Pradesh, AP News, Crime news, Guntur

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు