గణేష్ నిమజ్జనం వేళ ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఏ మాత్రం ఏమరపాటుగా ఉన్న నదులు, చెరువుల వద్ద ప్రమాదాలు జరుగుతాయి. తాజాగా విశాఖపట్టణం జిల్లాలో ఓ గణేష్ నిమజ్జనం కార్యక్రమంలో అపశృతి జరిగింది. సముద్రంలో వినాయకుడిని నిమజ్జనం చేస్తుండగా నలుగురు యువకులు గల్లంతయ్యారు. పాయకరావుపేట మండలం వెంకటనగరం సముద్ర తీరంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పాయకరావు పేట మండలం పెదరామభద్రాపురం గ్రామానికి చెందిన ఆరుగురు యువకులు వినాయక నిమజ్జనం కోసం సముద్ర తీరానికి వెళ్లారు. సముద్రంలో వినాయకుడిని నిమజ్జనం చేస్తున్న సమయంలోనే అలలు ఎగసిపడ్డాయి. అలల ధాటికి అందరూ కొట్టుకుపోయారు. వారిలో ఇద్దరు యువకులు ఈదుకుంటూ ఒడ్డుకు చేరారు. మరో నలుగురు యువకులు గల్లంతయ్యారు. సమచారం అందుకున్న పోలీసులు ఘటాన స్థలానికి వెళ్లి పరిశీలించారు. గజ ఈతగాళ్లను రంగంలోకి దింపి గల్లైంతన వారి కోసం సముద్రంలో గాలిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Ganesh immersion, Visakhapatnam