హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

రెండు లక్షల నెమలి పింఛాలతో వినాయకుడు.... గిన్నీస్ రికార్డ్ దిశగా...

రెండు లక్షల నెమలి పింఛాలతో వినాయకుడు.... గిన్నీస్ రికార్డ్ దిశగా...

నెమలి పింఛంతో వినాయకుడు

నెమలి పింఛంతో వినాయకుడు

దాదాపు రెండు లక్షలకు పైగా నెమలి పింఛములతో వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.

  వినాయక చవితి సందర్భంగా దేశవ్యాప్తంగా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఊరువాడ వినాయకుడు కొలువుతీరాడు. ఏ గల్లీ చూసినా గణేస్ మండపమే దర్శనమిస్తోంది. ఎవరికి తోచిన రీతిలో వారు.. వినయకుడ్ని విభిన్న ఆకృతులతో తయారు చేసి... భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా పాలకొండ నగర పంచాయతీలో ఉన్న కాపు వీధిలో ఉత్సవ కమిటీ కూడా ఇదే తరహాలో వినాయక విగ్రహం ఏర్పాటు చేసింది. అయితే ఈ వినాయకుడు ఎంతో ప్రత్యేకం. ఎందుకంటే... ఇక్కడ గణనాథుడి ప్రతిమను పూర్తిగా నెమలి పింఛములతో తయారు చేశారు.

  సహజంగా వినాయక విగ్రహాలను ప్లాస్టర్ ఆఫ్ పారిస్ లేదా మట్టితో తయారు చేస్తారు. కానీ ఈ విగ్రహాన్ని మాత్రం ఎంతో ప్రత్యేకంగా అలంకరించారు. దాదాపు రెండు లక్షలకు పైగా నెమలి పింఛములతో వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఇలాంటి విగ్రహం తయారు చేయడం దేశంలో ఇద మొదటిసారని చెబుతున్నారు ఉత్సవ కమిటీ సభ్యులు. గిన్నిస్ బుక్ లో కూడా చోటు సంపాదించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కమిటీ వారు గిన్నిస్ ప్రతినిధులను సంప్రదిస్తున్నారని సమాచారం.

  Published by:Sulthana Begum Shaik
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Ganesh Chaturthi​, Srikakulam, Vinayaka Chavithi

  ఉత్తమ కథలు