Home /News /andhra-pradesh /

GANESH CHATURTHI SPECIAL MORE BENEFITS TO WHO VISIT HARIDRA GANAPATI NGS

Vinayaka chavithi: హరిద్ర గణపతిని పూజిస్తే ఎన్నో ప్రయోజనాలు.. దోషాలు పోగొట్టే గణేషుడు.. వీడియో చూడండి

హరిద్ర గణపతిని పూజిస్తే ఎన్నో ప్రయోజనాలు

హరిద్ర గణపతిని పూజిస్తే ఎన్నో ప్రయోజనాలు

Ganesh Chaturthi 2021: వినాయకుడు మనకు అనేక రూపాల్లో దర్శనమిస్తున్నాడు. అయితే హరిద్ర గణపతి అందులో మరింత ప్రత్యేకం.. ఒక్కసారి దర్శించుకుంటే ఎన్నో లాభాలు కలుగుతాయి.. అవి ఏంటో తెలుసా..?

  Haridra Ganapathi: భారత దేశ వ్యాప్తంగా వినాయక చవితి (Vinayaka Chavithi) శోభ నెలకొంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోనూ ఆధ్యాత్మిక వాతావరణం సంతరించుకుంది. తెల్లవారుజామునే నిద్రలేచిన భక్తులు.. బొజ్జ గణపయ్యను భక్తిశ్రద్ధలతో పూజిస్తున్నారు. నైవేద్యాలు సమర్పిస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లో పరిస్థితి ఎలా ఉన్నా.. ఏపీలో నిన్నటి వరకు కాస్త గందరగోళమే ఉండేది.. ఏపీ ప్రభుత్వం బహిరంగ ప్రదేశాల్లో వినాయక ఉత్సవాలను నిషేధించింది. అంతేకాదు చాలా చోట్ల వేసి ఉన్న స్టేజ్ లను పోలీసులు బలవంతంగా కూల్చి వేయడంతో.. ఏపీలో ఈ ఏడాది వేడుకలు లేనట్టే అని అంతా అనుకున్నారు. కానీ చివరిలో హైకోర్టు తీర్పు ఊరట నిచ్చింది. కోవిడ్ నిబంధనలు అనుసరిస్తూ.. ప్రైవేటు స్థాలల్లో వేడుకలు నిర్వహించుకునేందుకు అనుమతిచ్చింది. దీంతో అప్పటికప్పుడు కొందరు వేడుకలకు సిద్దమయ్యారు. దీంతో ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో కూడా గతంతో పోలిస్తే తక్కువే అయినా.. గణపతి శోభ మాత్రం కనిపిస్తోంది.  పలు చోట్ల మండపాల్లో వివిధ రకాల గణనాథులు దర్శనమిస్తున్నారు.  అయితే కోర్టు తీర్పు.. కోవిడ్ ఆంక్షలు నేపథ్యంలో.. నిబంధనలు పాటిస్తూ దూరందూరంగా ఉత్సవాలు నిర్వహిస్తున్నారు.

  రాష్ట్రా వ్యాప్తంగా పలు రూపాల్లో గణేషుడు దర్శనమిస్తున్నాయి. అయితే విశాఖపట్నం జిల్లా (Visakhapatnam district)లోని అనకాపల్లి (Anakapalli)లోని నూకాంబిక అమ్మవారి ఆలయంలో వెలసిన వినాయకుడు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాడు. దేశంలోనే ఎక్కడా లేన్నట్టుగా పాలవెల్లులతో మండపాన్ని అత్యంత అందంగా అలంకరించారు గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు.. 2 లక్షల పసపు కొమ్ములతో ఇక్కడ వినాయకుడిని ఏర్పాటు చేశారు. గణేష్ నవరాత్రుల్లో ప్రతి రోజూ ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. దీన్ని హరిద్ర గరణపతి (Haridra Ganapathi) అని పిలుస్తారు. ఇదిగో చూడండి..

  http://  ముఖ్యంగా కరోనా సమయంలో హరిద్ర గణపతిని పూజించడం చాలా మేలు చేస్తోంది అంటున్నారు పండితులు. ముఖ్యంగా జాతకంలో గురుగ్రహం బలహీనంగా ఉన్నవారు హరిద్ర గణపతిని ఆరాధించడం మంచిది. వ్రతాలు, పూజల్లో పసుపు ముద్దతో వినాయకుడిని రూపొందించి పూజించడం ఆనవాయితీ. పసుపుముద్దతో కాకుండా పసుపు కొమ్ముపైనే వినాయకుని ఆకారాన్ని పూజమందిరంలో ప్రతిష్ఠించి నిత్యం పూజించుకోవచ్చు. పసుపుకొమ్ముపై రూపొందించిన గణపతినే హరిద్ర గణపతి అంటారు. పసుపు కొమ్ముపై చెక్కించిన హరిద్ర గణపతిని పసుపు రంగు వస్త్రంపై ఉంచి పూజించాలి. ఏదైనా గురువారం రోజున హరిద్ర గణపతి పూజను ప్రారంభించవచ్చు.

  ఇదీ చదవండి: మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు.. దేనికి సంకేతం?

  జీర్ణకోశ సంబంధమైన సమస్యలు సమసిపోవడానికి, వివాహ దోషాలు తొలగిపోవడానికి, పరీక్షలలో ఉత్తీర్ణతకు హరిద్ర గణపతి ఆరాధన ప్రశస్తమైనది. వ్యాపార సంస్థలు నడిపేవారు హరిద్రగణపతి మూర్తిని గల్లాపెట్టెలో ఉంచినట్లయితే, ఆటంకాలు తొలగి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. హరిద్ర గణపతికి నిత్యం ధూప దీప నైవేద్యాలు సమర్పించి, గణపతి మూల మంత్రాన్ని, గణేశ గాయత్రీ మంతాన్ని పదకొండు సార్లు చొప్పున పఠించాలి. పురోహితులకు శనగలు, పసుపు రంగు వస్త్రాలను ఇతోధిక దక్షిణతో కలిపి దానం చేయాలి. గురువులను తగిన కానుకలతో సత్కరించి, వారి ఆశీస్సులు పొందాలి.
  Published by:Nagesh Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Vinayaka Chavithi, Visakhapatnam

  తదుపరి వార్తలు