హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Ganesh Chaturthi: వినాయక చవితిపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

Ganesh Chaturthi: వినాయక చవితిపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

కరోనా పరిస్థితుల దృష్ట్యాల బహిరంగ వినాయక మండపాలు, భారీ గణనాథుల ఏర్పాటు, నదులు, చెరువుల్లో సామూహిక నిమజ్జనానికి అనుమతి లేదని తెలిపారు.

  మరో మూడు రోజుల్లోనే గణేష్ నవరాత్రి వేడుకలు ప్రారంభం కానున్నాయి. వినాయక చవితి కోసం ఇప్పటికే చాలా మంది విగ్రహాలను బుక్ చేశారు. మండపాల ఏర్పాట్లలో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో గణేష్ చతుర్ధి వేడుకలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. ఈ ఏడాది బహిరంగ వినాయక మండపాలు, సామూహిక నిమజ్జనానికి అనుమతి లేదని.. ఇళ్లల్లోనే పూజలు చేసుకోవాలని స్పష్టం చేసింది. విగ్రహాలు పొడవుకు 2 అడుగుల కంటే ఎక్కువగా ఉండకూడదని.. ఎక్కడ ప్రతిష్టించారో అక్కడే నిమజ్జనం చేయాలని తెలిపింది. కరోనావైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు దేవాదాయ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు.

  బుధవారం మధ్యాహ్నం దేవాదాయశాఖ కార్యాలయంలో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ నేతృత్వంలో వినాయక చవితి వేడుకలపై సమీక్షా సమావేశం జరిగింది. ఆ భేటీలో దేవాదాయశాఖ కమిషనర్ అర్జునరావు, దేవాదాయశాఖ జాయింట్ కమిషనర్ ఆజాద్, హెల్త్ డైరెక్టర్ అరుణ కుమారి, లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీజీ రాజశేఖర్‌తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. భేటీ అనంతరం మాట్లాడిన మంత్రి వెల్లంపల్లి.. కరోనా పరిస్థితుల దృష్ట్యాల బహిరంగ వినాయక మండపాలు, భారీ గణనాథుల ఏర్పాటు, నదులు, చెరువుల్లో సామూహిక నిమజ్జనానికి అనుమతి లేదని తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాయాల్లో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ వినాయక పూజలు చేసుకోవచ్చని చెప్పారు. ఊరేగింపులు, లౌడ్ స్పీకర్లు, డీజేలకు అనుమతులు లేవని స్పష్టం చేశారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకునే ఈ నిర్ణయం తీసుకున్నామని.. అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

  కాగా, ఏపీలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,16,003కి చేరింది. కరోనాను జయించి 2,26,372 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. కరోనా బారినపడి రాష్ట్రంలో 2,906 మంది మరణించారు. ప్రస్తుతం 86,725 కరోనా యాక్టివ్ కేసులున్నట్లు ఏపీ వైద్యఆరోగ్యశాఖ తెలిపింది. ఇక టెస్టుల విషయానికొస్తే.. గడిచిన 24 గంటల్లో 57,685 శాంపిల్స్‌ను పరీక్షించారు. ఇందులో 23,599 ర్యాపిడ్ యాంటిజెన్ టెస్ట్‌లు ఉన్నాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకు 30,19,296 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు.

  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Ganesh Chaturthi 2020, Vinayaka Chavithi 2020

  ఉత్తమ కథలు