హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

AP Village Secretariats: గ్రామ సచివాలయాల్లో పెళ్లి సందడి.. పిల్లనిచ్చేందుకు పోటీ.. పెళ్లికొడుకులకు డిమాండ్

AP Village Secretariats: గ్రామ సచివాలయాల్లో పెళ్లి సందడి.. పిల్లనిచ్చేందుకు పోటీ.. పెళ్లికొడుకులకు డిమాండ్

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వం ఇటీవల గ్రామ, వార్డు సచివాలయ (AP Village secretariats) ఉద్యోగులకు ప్రొబేషన్ ఖరారు చేసిన సంగతి తెలిసిందే. దాదాపు 1.30 లక్షల మంది ఉద్యోగులకు ప్రొబేషన్ ఖరారు చేయడమే కాకుండా.. కొత్త పే స్కేల్ ప్రకారం జీతాలు చెల్లిస్తున్నట్లు స్పష్టం చేసింది.

ఇంకా చదవండి ...

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వం ఇటీవల గ్రామ, వార్డు సచివాలయ (AP Village secretariats) ఉద్యోగులకు ప్రొబేషన్ ఖరారు చేసిన సంగతి తెలిసిందే. దాదాపు 1.30 లక్షల మంది ఉద్యోగులకు ప్రొబేషన్ ఖరారు చేయడమే కాకుండా.. కొత్త పే స్కేల్ ప్రకారం జీతాలు చెల్లిస్తున్నట్లు స్పష్టం చేసింది. దీంతో ఉద్యోగులందరికీ ఆగస్టులో తీసుకునే జూలై నెల జీతాలు పెరగనున్నాయి. కొత్త పే స్కేల్ ప్రకారం గ్రామ సచివాలయాల్లోని ఉద్యోగులకు రూ.25 వేల నుంచి రూ.27వేలు, వార్డు సచివాలయాల్లోని వారికి దాదాపు రూ.31వేల వరకు జీతాలు వచ్చే అవకాశమున్నట్లు లెక్కలువేసుకుంటున్నారు. దాదాపు 9 నెలల నిరీక్షణ తర్వాత ఉద్యోగాలు పర్మినెంట్ కావడంతో ఉద్యోగులంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇకపై పూర్తిస్థాయి ప్రభుత్వ ఉద్యోగులుగా మారడంతో సంబరాలు చేసుకుంటున్నారు కూడా.

ఐతే గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ఆనందానికి మరో కారణం కూడా ఉంది. జీతాలు పెరగడం, ఉద్యోగం పర్మినెంట్ కావడం ఒక ఎత్తయితే.. ప్రొబేషన్ ఖరారు కాకపోవడంతో చాలా మందికి పెళ్లిళ్లు సందిగ్ధంలో పడ్డాయి. గతేడాది నవంబర్ లో ప్రొబేషన్ ఖరారయ్యే సమయంలో ఉద్యోగుల్లో చాలామంది పెళ్లిళ్లు సందిగ్ధంలో పడ్డాయి. ఉద్యోగం పర్మినెంట్ కాకపోవడంతో సచివాలయ ఉద్యోగులకు పిల్లనిచ్చేవారు ఆలోచించాల్సిన పరిస్థితి. కొందరికైతే పర్మినెంట్ అయ్యాక చూద్దాంలో అనే పరిస్థితి ఎదురైంది. జీతం రూ.15వేలే ఉండటం, పర్మినెంట్ కాకపోవడంతో వారికి పిల్లనిస్తే సుఖపడుతుందా అని అమ్మాయిల తల్లిదండ్రులు ఆలోచనలో పడ్డ సందర్భాలు చాలానే ఉన్నాయి. వేలాది మంది పెళ్లిళ్లు ప్రొబేషన్ తో ముడిపడి ఉండటంతో యువకులకు ఆందోళన తప్పలేదు.

ఇది చదవండి: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఆ అవకాశం మరో ఏడాది పొడిగింపు


తాజాగా ఉద్యోగం పర్మినెంట్ కావడంతో సచివాలయాల్లోని పెళ్లికాని ప్రసాదులంతా ఎగిరి గంతేస్తున్నారు. అప్పట్లో రూ.15వేల జీతముంటే కట్నం సంగతి దేవుడెరుగు.. కనీసం పిల్లనిచ్చే పరిస్థితి కూడా లేదని.. ఇప్పుడు జీతం పెరిగింది.. జాబ్ పర్మినెంట్ అయింది కాబట్టి సంబంధాలు క్యూ కడతాయని భావిస్తున్నారు. ఇన్నాళ్లూ గ్రామసచివాలయ ఉద్యోగమంటే మీకు పిల్లనెవరిస్తారు అనే మాటలను ఎదుర్కొన్న కొందరు యువకులు.. ఇప్పుడు కాలర్ ఎగరేసుకొని తిరుగుతున్నారు.

ఇది చదవండి: విజయమ్మ, షర్మిల ప్రాణాలకు ముప్పు..! టీడీపీ నేత సంచలన వ్యాఖ్యలు..


ఇక సచివాలయ ఉద్యోగులకు కట్నాలు కూడా భారీగానే ఇస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆషాఢమాసం రావడంతో కుదరాల్సిన పెళ్లిళ్లు, కుదిరే పెళ్లిళ్లు కాస్త వాయిదా పడ్డాయి. రాష్ట్రంలో జరిగే శ్రావణమాసం పెళ్లిళ్లలో చాలా వరకు గ్రామ సచివాలయ ఉద్యోగులవే అయ్యే అవకాశముంది. ఇదిలా ఉంటే ఇప్పుడు సచివాలయ ఉద్యోగులకు కూడా డిమాండ్ బాగానే ఉంది. ఉద్యోగాలు పర్మినెంట్ కావడంతో అబ్బాయిల తల్లిదండ్రులు కట్నకానుకలును బాగానే అడుగుతున్నారు. అంతేకాదు అప్పుడు పిల్లనివ్వడానికి నిరాకరించిన వారు ఇప్పుడు సచివాలయ సంబంధాల కోసం ఆసక్తి చూపుతున్నారు.

కొన్నిచోట్ల సచివాలయ ఉద్యోగులు, సచివాలయ ఉద్యోగులనే పెళ్లిళ్లు చేసుకొని సెటిల్ అవుతున్నారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా సచివాలయాల్లోనే ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటలు చాలానే ఉన్నాయి. ప్రస్తుతం పెళ్లికి ముహూర్తాలు లేకపోవడంతో త్వరలోనే సచివాలయ ఉద్యోగులంతా ఓ కానున్నారు. ఇప్పటికేనా ఉద్యోగాలు పర్మినెంట్ కావడంతో పెళ్లిళ్లు చేసుకొని జీవితంలో స్థిరపడతామని సచివాలయ ఉద్యోగులంటున్నారు.

First published:

Tags: Andhra Pradesh, Village secretariat

ఉత్తమ కథలు