Full Demand Andhra Bachelors : ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) యువకులకు విదేశాల ఫుల్ డిమాంబ్ ఉంటోంది. ముఖ్యంగా విదేశీ అమ్మాయిలు ( Foreign Girls) ఇక్కడ అబ్బాయిలను చాలా ఇష్ట పడుతున్నారు. వారి కోసం అన్ని వదులుకోవడానికి కూడా వెనుకాడడం లేదు. ఆంధ్రా నుంచి వారి దేశానికి వెళ్లే అబ్బాయిలు చూపించే నిజమైన ప్రేమకు పడిపోతున్నారు. ఆ నిజమైన ప్రేమ (Love)కు జాతి మతం, కులం. ప్రాంతం ఇవేమీ అడ్డుకావని నిరూపిస్తున్నారు. గతంలో చాలామంది విదేశీ వనితలు ఇక్కడి అబ్బాయిలను ప్రేమించి పెళ్లిల్లు చేసుకున్న ఘటనలు చూశాం.. తాజాగా గుంటూరు (Guntur) అబ్బాయిని టర్కీ (Turkey) అమ్మాయి. విశాఖ (Viskha) అబ్బాయిని రష్యా (Russia) అమ్మాయి ప్రేమించారు. వారి కోసం అన్ని వదిలి మన రాష్ట్రానికి వచ్చారు.. మన సంప్రదాయాల ప్రకారం అచ్చం తెలుగు అమ్మాయిలా తయారై పెళ్లి పీటలు ఎక్కారు.. హిందూ సంప్రదాయ పద్దతిలో మూడు ముళ్ళు ఏడు అడుగులతో కొత్తగా దాంపత్య జీవితంలోకి అడుగు పెట్టారు. ఈ రెండు పెళ్లిళ్లకు ఆంధ్రప్రదేశ్ లోని విశాఖ పట్నం. గుంటూరు వేదికగా నిలిచాయి.
విశాఖ పట్నం జిల్లాలోని కె.కోటపాడు మండలం కింతాడ గ్రామ సర్పంచ్ బండారు ఈశ్వరమ్మ, ముత్యాలనాయుడు కుమారుడుల ముద్దుల తనయుడు నరేష్ గత కొద్ది కాలంగా రష్యాలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. అక్కడే తనతో పాటు ఉద్యోగం చేస్తున్న అదే దేశానికి చెందిన ఇరీనా అనే యువతిని ప్రేమించాడు. వారి ప్రేమను అటు రష్యాలో ఉన్న అమ్మాయి పేరెంట్స్ కు.. ఇటు ఆంధ్రాలో ఉన్న అబ్బాయి తల్లి దండ్రులకు చెప్పి ఒప్పించారు. రెండు వైపులా పెద్దలు అంగీకరించడంతో వారి వివాహం హిందూ సంప్రాదయ పద్దతిలో జరిగింది. ఆ యువకుడి సొంత గ్రామం కింతాడలో ఆంధ్రా, రష్యా జంట పెళ్లి వేడుక అంగరంగ వైభవంగా జరిగింది.
Full demand to Andhra Prades bachelor || Foreign Girls love and married ... https://t.co/0ZJKpNrUJY via @YouTube #andhra #AndhraPolitics #wedding #weddingdress #weddingseason @AMEquality @LoveMarriageEdu
— nagesh paina (@PainaNagesh) December 30, 2021
ఘనంగా జరిగిన ఈ పెళ్లిలో విదేశీ యువతి పెళ్లికూతురైన ఇరీనా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అచ్చం అమె తెలుగు అమ్మాయిలా తయారై.. ఇక్కడి సంప్రదాయలపై మమకారాన్ని చూపించింది. కేవలం ఆమె మాత్రమే కాదు. వివాహానికి వచ్చిన ఇరీనా తల్లిదండ్రులు ఆండ్రీ, నేతాలియా భారతీయ సాంప్రదాయ దుస్తులను ధరించి ప్రత్యేకంగా నిలిచారు. అమ్మాయి తల్లి ఆండ్రీ కూడా అచ్చ తెలుగు మహిళలా పట్టు చీరను ధరించి సందడి చేశారు.
వరుడు తల్లికి రాజకీయ నేపథ్యంలో ఉండడంతో వైసీపీ నేతలు సైతం పెళ్లికి హాజరు అయ్యారు. వివాహ తంతు ముగిసిన తరువాత ఉత్తరాంధ్ర ఇలవేళ్పు దేవుడైన సింహాద్రి అప్పన్నను అంతా దర్శించుకున్నారు. ఆ నూతన వధూవరులు అప్పన్న స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. మరోవైపు గంటూరుకు చెందిన ఆంధ్ర అబ్బాయి.. టర్కీ అమ్మాయి మెడలో వేదమంత్రాల సాక్షిగా మూడు ముళ్ళు వేశాడు.. ఆత్మ డెప్యూటీ ప్రాజెక్ట్ డైరెక్టర్ దమ్మాటి వెంకటేశ్వర్లు కుమారుడు మధుసంకీర్త్ ఉద్యోగ రీత్యా టర్కీలో స్థిరపడ్డాడు. తన తో పాటు పనిచేస్తున్న టర్కీకి చెందిన చెందిన గిజెమ్ ను ప్రేమించాడు. ఈ ఇద్దరి ప్రేమకు కూడా పెద్దలు అంగీకరించడంతో.. హిందూ సంప్రదాయ పద్ధతిలో వీరి వివాహం కూడా గ్రాండ్ గా జరిగింది.
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.