Andhra Pradesh Temple Simhachalam: సింహాచలం దేవస్థానానికి అంతర్జాతీయ గుర్తింపు

సింహాచలం ఆలయం (ఫైల్)

సింహాచలం శ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామి దేవస్థానానికి ఐఎస్ఓ (international organization for standardization ) సర్టిఫికెట్ లభించింది. ఆలయానికి చెందిన అన్ని అంశాలనూ పరిగణనలోకి తీసుకుని సంస్థ ఈ గుర్తింపునిచ్చింది.

  • Share this:
    సింహాచలం శ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామి దేవస్థానానికి ... ఐఎస్ఓ (ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డైజేషన్ ) సర్టిఫికెట్ లభించింది. ఆలయానికి చెందిన అన్ని అంశాలనూ పరిగణనలోకి తీసుకుని సంస్థ ఈ గుర్తింపునిచ్చింది. ఈ సర్టిఫికెట్(Certificate) ను  రాష్ట్ర మంత్రి అవంతి శ్రీనివాస్, దేవస్థానం ఈఓ సూర్యకళ అందుకున్నారు. భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలు, ఉద్యోగుల నాణ్యమైన సేవలు, పరిశుభ్రత, పచ్చదనంలాంటి అంశాలను పరిగణలోకి తీసుకుని ఈ అవార్డునిచ్చారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భక్తులకు నాణ్యమైన సేవలందిచడంతోపాటు... హిందూ ధర్మాన్ని , సంస్కృతిని సింహాచలం దేవస్థానం ప్రమోట్ చేస్తోందని సర్టిఫికెట్ లో పేర్కొన్నారు.

    ఈ సందర్భంగా ఈఓ సూర్యకళ మాట్లాడుతూ..." మంత్రిగారి చేతులమీదుగా ఈ అవార్డును స్వీకరించడం చాలా శుభ పరిమాణం. ముఖ్యంగా గత ఆర్నెళ్ల నుంచి దేవస్థానంలో ఉద్యోగుల నాణ్యమైన సేవల గురించి ఆడిటర్ ద్వారా అంతర్జాతీయ సంస్థకు సమాచారం ఎప్పటికప్పుడు అందిస్తూ వచ్చాం.

    Andhra Pradesh: ద‌ర్జాగా "నకిలీ  స్టిక్క‌ర్" జ‌ర్నీ.. రంగంలోకి దిగిన పోలీసులు


    అంతర్జాతీయ(Internationa) ప్రమాణాలను మేం అందుకున్నాం. ఫుడ్ అండ్ సేఫ్టీ ఆడిటింగ్ ప్రస్తుతం దేవస్థానంలో జరుగుతోంది. ఆ రంగంల్లోనూ ఐఎస్ఓ(ISO) సర్టిఫికెట్ వస్తుందనిఆశిస్తున్నాం.

    ఈఓ సూర్యకళ మాట్లాడాక... మంత్రి అవంతి శ్రీనివాస్ మీడియా(Media)తో ముచ్చటిస్తూ... "ఐఎస్ఓ సర్టిఫికెట్ వచ్చేలా కృషిచేసిన దేవస్థానం ఈఓ సూర్యకళ, సిబ్బందికి నా అభినందనలు. ఒక సంస్థ మెయింటెయిన్ చేసే స్టాండర్డ్స్ ఆధారంగా ఇస్తారు. ఈఓ , ఉద్యోగులు చాలా కష్టపడి పనిచేసి దీన్ని సాధించారు. భక్తులకు మంచి సౌకర్యాలు కల్పింస్తున్నారు. ప్రసాద్ స్కీం ద్వారా 54 కోట్లు మంజూరయ్యాయి. కరోనా సెకెండ్ వేవ్ వల్ల కొత్త ఆలస్యమైంది. ఇప్పుడు ఆ వర్క్స్ కూడా ప్రారంభమవుతాయి. వసతి సౌకర్యం, క్యూలైన్ లో వచ్చే భక్తులకు మంచినీరు లాంటి సౌకర్యాలు అభివృద్ధి చేయడం లాంటివాటిపై దృష్టిపెడతాం. భక్తులకు అన్నదానం సౌకర్యాన్ని కూడా కల్పిస్తే బావుంటుంది. దీనిపై ఈఓ గారు దృష్టిపెట్టాలని కోరుతున్నా. సింహాచలం పంచ గ్రామాల సమస్యనుకూడా పరిష్కరిస్తే... ఇంకా బావుంటుందని‌" అన్నారు
    Published by:Sharath Chandra
    First published: