Andhra Pradesh: పాల ప్యాకెట్ ఓపెన్ చేసిన మహిళకు షాక్.. అందులో ఏముందంటే..!

Andhra Pradesh: పాల ప్యాకెట్ ఓపెన్ చేసిన మహిళకు షాక్.. అందులో ఏముందంటే..!

అంగన్ వాడీ పాలప్యాకెట్లో కప్ప

గతంలో ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో పలుచోట్ల అంగన్ వాడీ (Anganwadi) ద్వారా పంపిణీ చేసిన పోషకాహారం చెడిపోయిన ఘటనలు చోటు చేసుకున్నాయి. తాజాగా అనంతపురం జిల్లాలో (Ananthapur) అలాంటి ఘటనే కలకలం రేపింది.

  • Share this:
    ప్రభుత్వం సరఫరా చేసే సరుకులు, ఆహార పదార్థాలు పాడైపోయిన ఘటనలు తరచూ చోటు చేసుకుంటాయి. రవాణాలో దెబ్బతినడం, నిల్వ చేయడంలో లోపాల కారణంగా అలా జరుగుతుంది. కానీ అంగన్ వాడీ పాల ప్యాకెట్లో కప్ప రావడం తీవ్రకలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే అనంతపురం జిల్లా, రాయదుర్గం మండలం, రాయంపల్లి గ్రామంలోని ఓ అంగన్ వాడీ కేంద్రంలో నాలుగు రోజుల క్రితం పాలప్యాకెట్లు పంపిణీ చేశారు. గ్రామానికి చెందిన బాలింత ఇంద్రజ డైలీ అంగన్ వాడీ పాకెట్లను వినియిగిస్తోంది. ఎప్పటిలాగే ప్యాకెట్ ఓపెన్ చేసి గిన్నెలో పాలు పోయగా దుర్వాసన వచ్చింది. సరిగా చూడగా అందులో చనిపోయిన కప్ప కనిపించింది. దీంతో ఆందోళన చెందిన ఆమె వెంటనే అంగన్ వాడీ సిబ్బందికి సమాచారమిచ్చింది. సమాచారమందుకున్న అధికారులు విచారణ ప్రారంభించారు.

    బాలింత ఇంద్రజతో పాటు, అంగన్ వాడీ సిబ్బందిని విచారించిన ఐసీడీఎస్ అధికారులు వివరాలు నమోదు చేసుకొని ప్యాకెట్ బ్యాచ్ నెంబర్, సరఫరా చేసిన యూనిట్ పై దర్యాప్తు చేస్తున్నారు. అంగన్ వాడీ కేంద్రాన్ని తనిఖీ చేశారు. బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇంతకు ముందు గోరుముద్ద పథకం పురుగులు బయటపడిన విషయం మురవకముందే ఇప్పుడు పాల ప్యాకెట్‌లో కప్ప రావడం ఆందోళన కలిగిస్తోంది. విజయా సంస్థ వజ్ర బ్రాండ్ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా అంగన్ వాడీలకు ఆ పాలప్యాకెట్లను సరఫరా చేస్తోంది.

    గతంలో కొన్నిసార్లు ప్రభుత్వం పంపిణీ చేసిన పాలు కాలపరిమితి ముగిసిపోవడంతో తీవ్రదుమారం రేగింది. అలాగే మురిగిపోయిన గుడ్లు సరఫరా చేసిన ఘటనలు కూడా విమర్శలకు దారితీశాయి. కరోనా కారణంగా పాఠశాలలు, అంగన్ వాడీలు మూతపడటంతో మూడు నెలలు కలిపి ఐకేసారి వంద గుడ్లు పంపిణీ చేయడంతో అక్కడక్కడా విమర్శలు వచ్చాయి. కొన్నిరోజుల క్రితం విశాఖజిల్లాలో మురిగిపోయిన గుడ్లను అంగన్ వాడీల్లో సరఫరా చేయడం దుమారం రేగింది. పోషకాహారాన్ని కనీసం తనిఖీ చేయకుండా సరఫరా చేస్తున్నారని లబ్ధిదారులు మండిపడుతున్నారు.
    Published by:Purna Chandra
    First published:

    అగ్ర కథనాలు