ఏపీలో ఐదో విడత ఉచిత రేషన్ నేడే ప్రారంభం.. కందిపప్పు కూడా..

ఏపీలో ఐదో విడత ఉచిత రేషన్ నేడే ప్రారంభం.. కందిపప్పు కూడా..

రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా పథకం తీసుకొస్తే దాని కోసం ఆదాయ ధ్రువీకరణ పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. వాటి కోసం మళ్లీ రెవిన్యూ ఆఫీసు చుట్టూ తిరగాలి.

ఏపీలో రేషన్ కార్డుదారులకు ఉచిత రేషన్ అందించే ప్రక్రియను ఏపీ సర్కారు ప్రారంభించింది. కార్డుదారులకు మనిషికి 5 కిలోల చొప్పున పీడీఎఫ్ బియ్యం, కేజీ కందిపప్పును అందించనున్నారు.

  • Share this:
    ఏపీలో రేషన్ కార్డుదారులకు ఉచిత రేషన్ అందించే ప్రక్రియను ఏపీ సర్కారు ప్రారంభించింది. కార్డుదారులకు మనిషికి 5 కిలోల చొప్పున పీడీఎఫ్ బియ్యం, కేజీ కందిపప్పును అందించనున్నారు. రాష్ట్రంలోని 28,354 రేషన్ దుకాణాల ద్వారా సరుకుల పంపిణీ చేస్తున్నారు. కోవిడ్ 19 నిబంధనల ప్రకారం.. రేషన్ తీసుకునేందుకు దుకాణాల వారీగా టైం స్లాట్ కూపన్లను జారీ చేశారు. పోర్టబిలిటీ, బయోమెట్రిక్ పద్ధతిలో రేషన్ సరుకులను లబ్ధిదారులకు అందజేయనున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1,48,05,879 కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. ఇక.. అన్ని రేషన్ షాప్ కౌంటర్ల వద్ద శానిటైజర్లను అందుబాటులో ఉంచుతున్నట్లు అధికారులు వెల్లడించారు.
    Published by:Shravan Kumar Bommakanti
    First published:

    అగ్ర కథనాలు