• HOME
  • »
  • NEWS
  • »
  • ANDHRA-PRADESH
  • »
  • FOUR YOUTH ATTACKED GOVT TEACHER AND A WOMAN WHO ARE IN ILLEGAL RELATIONSHIP AND ESCAPED WITH ONE LAKH MONEY AND MOBILE IN CHITTOOR HSN

ఉపాధ్యాయుడి అక్రమ సంబంధం గురించి తెలిసి నలుగురు యువకుల పక్కా స్కెచ్.. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని..

ఉపాధ్యాయుడి అక్రమ సంబంధం గురించి తెలిసి నలుగురు యువకుల పక్కా స్కెచ్.. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని..

ప్రతీకాత్మక చిత్రం (image from youtube)

చిత్తూరు జిల్లాలో ఓ ఘటన జరిగింది. ఓ మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్న ఓ ఉపాధ్యాయుడు భారీ నష్టాన్ని చవిచూశాడు. కొందరు యువకులు అతడి గురించి తెలిసి పక్కా స్కెచ్ తో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఆ తర్వాత..

  • Share this:
    రాష్ట్రంలో ఎక్కడో ఒక మూల ప్రతి రోజూ అక్రమ సంబంధాల వల్ల జరిగిన ఘోరాల గురించి వార్తలు వస్తూనే ఉన్నాయి. భార్యను భర్త చంపేయడమో, భార్యే ప్రియుడి సాయంతో భర్తను హతమార్చడమో జరుగుతున్నాయి. కొన్ని సందర్భాల్లో భార్యాభర్తలిద్దరూ తమ మధ్య వచ్చిన మూడో వ్యక్తిని అంతమొందించిన ఘటనలు కూడా ఉన్నాయి. తాజాగా చిత్తూరు జిల్లాలో ఓ ఘటన జరిగింది. ఓ మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్న ఓ ఉపాధ్యాయుడు భారీ నష్టాన్ని చవిచూశాడు. కొందరు యువకులు అతడి గురించి తెలిసి పక్కా స్కెచ్ తో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఆపై అతడిని బెదిరించి దాదాపు లక్ష రూపాయలను స్వాహా చేశారు. అతడి వద్ద ఉన్న డబ్బునంతా ఊడ్చేశారు. ఆ తర్వాత అక్కడి నుంచి ఉడాయించారు. చిత్తూరు జిల్లా కుప్పం పరిధిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

    కుప్పం పరిధిలోని రామకుప్పం మండలంలోని ఓ గ్రామంలోని ఉన్నత పాఠశాలలో ఓ ఉపాధ్యాయుడు అదే ఊరిలోని ఓ మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. వారి రాసలీలల కోసమే కుప్పం పరిధిలోని రాజీవ్ కాలనీలో ఓ ఇంటిని అద్దెకు కూడా తీసుకున్నాడు. వారి వ్యవహారాన్ని రామకుప్పం మండలం ఆనిగానూరుకు, విజలాపురం గ్రామాలకు చెందిన నలుగురు యువకులు చాలా కాలం నుంచే గమనిస్తూ వచ్చారు. వారిపై నిఘా వేశారు. ఎప్పుడు ఎక్కడకు వెళ్తుంటారన్నది పరిశీలించారు. ఎప్పటిలాగానే వారాంతమైన శనివారం ఆ ఉపాధ్యాయుడు ఆ మహిళతో కలిసి రాజీవ్ కాలనీలోని అద్దె ఇంటికి వచ్చాడు.

    కొద్ది సేపటి తర్వాత ఆ ఇంటి నుంచి పనిమీద ఆ ఉపాధ్యాయుడు బయటకు వెళ్లాడు. అదే సమయంలో ఆ నలుగురు కుర్రాళ్లు ఆ ఇంట్లోకి వెళ్లారు. ఒంటరిగా ఉన్న ఆ మహిళను భయపెట్టారు. ఆమెను కొట్టి ఆ ఉపాధ్యాయుడికి ఫోన్ చేయించారు. ఇంటికి రప్పించారు. హుటాహుటిన ఇంటికి చేరుకున్న ఆ ఉపాధ్యాయుడిపై కూడా దాడి చేశారు. బెదిరించి, భయపెట్టి అతడి అకౌంట్ నుంచి ఆన్ లైన్ పేమెంట్స్ యాప్స్ ద్వారా దాదాపు లక్ష రూపాయలను ఆ యువకుల అకౌంట్లకు పంపించుకున్నారు. అతడి జేబులో ఉన్న పది వేల రూపాయలను కూడా లాగేసుకున్నారు.

    ఆ తర్వాత వారిని అక్కడే వదిలేసి అతడి చేతిలో ఉన్న మొబైల్ తో సహా ఉడాయించారు. పక్కింట్లో ఏదో గొడవ జరుగుతోందని పోలీసులకు స్థానికులు ఫిర్యాదు చేశారు. పోలీసులు వచ్చేసరికి ఆ ఉపాధ్యాయుడు, మహిళ మాత్రమే ఉన్నారు. మొదట ఏం జరిగిందో ఆ ఉపాధ్యాయుడు నోరు విప్పలేదు. అయితే ఆ మహిళ మాత్రం జరిగిందంతా పూసగుచ్చినట్టు చెప్పింది. అతడు కూడా జరిగింది నిజమేనని ఒప్పుకున్నాడు. దీంతో పోలీసులు ఈ విషయమై కేసు నమోదు చేసుకున్నారు. ఉపాధ్యాయుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నామనీ, దర్యాప్తు చేస్తున్నామని కుప్పం ఎస్సై నరేంద్ర తెలిపారు.
    Published by:Hasaan Kandula
    First published:

    అగ్ర కథనాలు