పల్నాడు (Palnadu) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం Road Accident) జరిగింది. పెళ్లి బృందంతో వెళ్తున్న వాహనాన్ని ఓ టిప్పర్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. పలువురికి గాయాలయ్యాయి. పల్నాడు జిల్లా వెల్దుర్తి సమీపంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ముటకూరుకు చెందిన పెళ్లి బృందం శిరిగిరిపాడుకు బయలుదేరింది. అయితే మార్గమధ్యలో వెల్దుర్తి మండలం ఉప్పలపాడు వద్ద వారి వాహనాన్ని టిప్పర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు స్పాట్‌లోనే చనిపోయారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు.
ఈ విషయాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని.. సహాయక కార్యక్రమాలు చేపట్టారు. గాయపడ్డ వారిని మాచర్ల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పలువురి పరిస్థితి విషమంగా ఉండడంతో.. మెరుగైన వైద్య చికిత్స కోసం గుంటూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
మృతుల్లో స్కార్పియో డ్రైవర్‌తోపాటు మహిళ, ఇద్దరు చిన్నారులు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో కారులో 10 మంది ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. టిప్పర్ అతి వేగమే ప్రమాదానికి కారణమని.. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఇంతటి ఘోరం జరిగిందని స్థానికులు వెల్లడించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Local News, Road accident