కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. డీసీఎం లారీ తీవ్ర బీభత్సం సృష్టించింది. మంగళవారం తెల్లవారుజామున చోటుచేసుకున్న ఈ ప్రమాదంలో నలుగురు చిన్నారులు మృతిచెందారు. ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. శిరివెళ్ల మండలం ఎర్రగుంట్లలో క్రిస్మస్ మాసం సందర్భంగా క్రైస్తవులు వేకువ జామున ప్రార్థనలు చేయడానికి బయలుదేరారు. వీరు రోడ్డు దాటుతున్న సమయంలో డీసీఎం లారీ ఢీకొట్టినట్టుగా తెలుస్తోంది. ఈ ప్రమాదంలో నలుగురు చిన్నారులు మృతిచెందగా మరో పది మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో దాదాపు 40 మంది రోడ్డుపై ఉన్నట్టుగా తెలుస్తోంది. గాయపడినవారిని వెంటనే నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. ప్రమాదానికి గల కారణాలను పరిశీలించారు. మృతులను స్థానిక ఎర్రగుంటకు చెందిన సురేఖ, ఝాన్సీ, వంశీ, హర్షవర్దన్లుగా గుర్తించారు. ఇక, ప్రమాదం జరిగిన తర్వాత లారీ డ్రైవర్ వాహనాన్ని ఆపకుండా వెళ్లిపోయాడు. అయితే అతన్ని వెంబడించిన స్థానికులు ఆళ్లగడ్డ సమీపంలోని బత్తులూరు వద్ద అతన్ని పట్టుకున్నారు. అనంతరం అతన్ని పోలీసులకు అప్పగించారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Published by:Sumanth Kanukula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.