శ్రీకాకుళం (Srikakulam) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. అతివేగంతో అదుపు తప్పిన ఓ లారీ.. బీభత్సం సృష్టించింది. రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తున్న ఉపాధి హామీ కూలీలపైకి దూసుకెళ్లి.. వారి ప్రాణాలను తీసింది. ప్రమాదం (Srikakulam Road Accident) లో ముగ్గురు కూలీలు స్పాట్‌లోనే మరణించగా.. మరికొందరికి గాయాలయ్యాయి. ఆమదాలవలస-పాలకొండ రోడ్డుపై మందాడ గ్రామం వద్ద ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందించిన వెంటనే పోలీసులు అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.
గాయపడ్డ వారిని హుటాహుటిన శ్రీకాళకు సర్వజన ఆస్పత్రికి తరించారు. క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మృతులను గురువందల పాపమ్మ, అంబటి సత్తెమ్మ, కురమాల లక్ష్మిగా గుర్తించారు.
లారీ డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Local News