Home /News /andhra-pradesh /

FOUR KILLED IN LPG CYLINDER BLAST IN ANANTAPURAM DISTRICT ANDHRA PRADESH FULL DETAILS HERE PRN BK

Cylinder Blast: అనంతపురం జిల్లాలో విషాదం.. సిలిండర్ పేలి నలుగురు మృతి.. నిద్రలోనే ఘోరం..

పేలుడు ధాటికి కూలిన ఇల్లు

పేలుడు ధాటికి కూలిన ఇల్లు

అనంతపురం జిల్లా (Anantapuram District) లో విషాదం చోటు చేసుకుంది. కల్యాణదుర్గం నియోజకవర్గం, శెట్టూరు మండలం ములకలేడులో గ్యాస్ సిలెండర్ పేలి నలుగురు మృతి చెందారు.

    వాళ్లంతా రాత్రి కబుర్లు చెప్పుకొని హాయిగా నిద్రపోయారు. మరో గంటాగితే నిద్రలేచి ఎవరి పనులు వాళ్లుచూసుకునేవారు. కానీ సూర్యుడు ఉదయించకుండానే ఆకుటుంబంలోని వారి బ్రతుకులు తెల్లారిపోయాయి. నిద్రమత్తులో ఉండగా గ్యాస్ సిలిండర్ రూపంలో మృత్యువు వారిని కబళించింది. వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని అనంతపురం జిల్లా (Anantapuram District) లో విషాదం చోటు చేసుకుంది. కల్యాణదుర్గం నియోజకవర్గం, శెట్టూరు మండలం ములకలేడులో గ్యాస్ సిలెండర్ పేలి నలుగురు మృతి చెందారు. శనివారం తెల్లవారుజామున గ్రామంలోని ఓ ఇంట్లో సిలిండర్ పేలడంతో పైకప్పు పక్కింటి పైకప్పు కూలింది. ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతి చెందిన వారిలో కుటుంబ పెద్ద జైనాభి (60), ఆమె కుమారుడు దాదు (36), కోడలు సర్ఫున్నీ (28) మూడేళ్ళ మనవరాలు ఫిర్దోస్ ఉన్నారు.

    సిలిండర్ పేలిన ఇంట్లో ఇద్దరికి తీవ్రగాయాలవగా కళ్యాణదుర్గం ఆస్పత్రికి తరలించారు. సిలిండర్ పేలుడు ధాటికి రెండిళ్లు నేలమట్టామయ్యాయి. ప్రమాదం తెల్లవారుజామున జరగంతో అంతా నిద్రమత్తులో ఉన్నారు. పై కప్పు నేరుగా ఇంట్లో నిద్రిస్తున్నవారిపై కూలడంతో కనీసం తెలుసుకునే వీలు కూడా లేకపోయింది. నిద్రలోనే నాలుగు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.

    ఇది చదవండి: ఏపీలో వింత జంతువు కలకలం.. హడలిపోతున్న రైతులు.. అధికారుల హెచ్చరిక..


    కుటుంబమంతా ఒకే ప్రమాదంలో మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను పోస్ట్ మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. పేలుడు ఎలా జరిగింది. రాత్రి పడుకునే ముందు రెగ్యులేటర్ ఆఫ్ చేయలేదా.. లేక సిలిండర్లోనే ఏదైనా సమస్య ఉందా అని పోలీసులు ఆరా తీస్తున్నారు. తెల్లవారుజామున పెద్దపేలుడు సంభవించడంతో స్థానికులంతా భయంతో హడలిపోయారు.

    ఇది చదవండి: వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డికి గుండెపోటు.. ఆందోళనలో నేతలు..


    ఇదిలా ఉంటే గత రెండురోజులుగా జరుగిన పలు ప్రమాదాల్లో ఏకంగా కుటుంబాలే మృత్యువాత పడిన ఘటనలు చోటు చేసుకున్నాయి. అన్నమయ్య జిల్లా (Annamayya District) మదనపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం (Road Accident) లో గంగిరెడ్డి అనే వ్యక్తితో పాటు భార్య, ఇద్దరు పిల్లలు కూడా ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఇక గుంటూరు జిల్లా (Guntur District) కాకాని వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో విజయవాడ కస్తుర్బా పేటకు చెందిన భార్య, భర్త, కుమార్తె మృతి చెందారు. అదృష్టవశాత్తూ వారి పదేళ్ల కుమారుడు ప్రాణాలతో బయటపడ్డాడు. అంతకుముందు చిత్తూరు జిల్లా (Chittoor District) ఐతేపల్లి వద్ద జరిగిన ప్రమాదం కూడా నిండు కుటుంబాన్ని బలితీసుకుంది. చిన్నపాటి నిర్లక్ష్యం, వేగంతో పదులకొద్దీ ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపుతున్నాయి.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Anantapuram, Andhra Pradesh, LPG Cylinder

    తదుపరి వార్తలు