Home /News /andhra-pradesh /

FOUR FEET BRIDE TWO FEET GROOM ARRANGED MARRIAGE IN EAST GODAVARI DISTRICT FULL DETAILS HERE HSN

ఎత్తును కాదు.. మనసును చూసి మనువాడింది.. రెండు అడుగుల ఎత్తున్న డిగ్రీ కుర్రాడితో నాలుగు అడుగుల యువతి పెళ్లి..

దేవరపల్లి శ్రీనివాస్, సత్యదుర్గ

దేవరపల్లి శ్రీనివాస్, సత్యదుర్గ

అబ్బాయి ఎత్తు రెండు అడుగులు. డిగ్రీ చదివాడు. వధువు ఎత్తు నాలుగు అడుగులు. ఎనిమిదో తరగతి వరకు చదువుకుంది. ఇద్దరూ పరస్పరం ఇష్టపడటంతో పెద్దలు పెళ్లి చేసేందుకు నిశ్చయించారు.

    కొన్ని కొన్ని పెళ్లిళ్లు ఇట్టే ఆకట్టుకుంటాయి. మనసులను కట్టిపడేస్తాయి. గుండెల్లో సంతోషాన్ని నింపుతాయి. కులం మతం, ప్రాంతం తేడా చూడకుండా ఆ వధూవరులను ప్రజలంతా మనసారా ఆశీర్వదిస్తుంటారు. చిత్తూరు జిల్లాలో ఓ అంథుడిని ఓ యువతి ప్రేమించి పెళ్లి చేసుకున్న ఘటన గురించి మీరు చదివే ఉంటారు. గుడ్డివాడిని చేసుకుని ఏం సుఖపడతావని అందరూ అంటున్నా ఆమె పట్టించుకోలేదు. మనసుకు నచ్చిన వాడినే మనువాడింది. పెద్దలను ఒప్పించి మరీ ప్రేమ పెళ్లి చేసుకుంది. తాజాగా అలాంటి ఘటనే మరొకటి జరిగింది. ఈ పెళ్లి పెద్దలు కుదిర్చిందే అయినా, తన కంటే ఎత్తు తక్కువ ఉన్న వ్యక్తిని ఓ యువతి పెళ్లాడింది. వరుడి ఎత్తు రెండు అడుగులు కాగా, వధువు ఎత్తు నాలుగు అడుగులు. తూర్పు గోదావరి జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

    ముమ్మిడివరం నగర పంచాయతీ క్రాప చింతలపూడి శాంతి నగర్ కు చెందిన దేవరపల్లి శ్రీనివాస్ డిగ్రీ వరకు చదువుకున్నాడు. అతడు చిన్నప్పటి నుంచి ఎత్తు తక్కువగానే ఉండి రెండడుగుల ఎత్తు మాత్రమే పెరిగాడు. ఇటీవలే అతడికి పెళ్లి సంబంధాలు చూడటం మొదలు పెట్టారు. ఈ క్రమంలోనే అమలాపురం మండలం సమనస గ్రామానికి చెందిన గొల్లపల్లి బలరామ్మూర్తి, లక్ష్మి దంపతుల చిన్న కుమార్తె సత్యదుర్గను ఇచ్చి పెళ్లి చేయాలని పెద్దలు నిర్ణయించుకున్నారు. సత్యదుర్గ ఎత్తు నాలుగు అడుగులు. ఎనిమిదో తరగతి వరకు చదువుకుంది. ఇద్దరిదీ ఎత్తు సమస్యే అయినా, అబ్బాయి కంటే అమ్మాయి రెండడుగులు ఎత్తు ఎక్కువ.
    ఇది కూడా చదవండి: గుడ్డివాడిని చేసుకుని ఏం సుఖపడతావన్న మాటల్నీ లెక్క చేయలేదు.. ప్రేమించిన వాడినే పెళ్లాడిన యువతి..

    అయినప్పటీకి పరస్పరం ఇద్దరూ ఇష్టపడటంతో వీళ్లిద్దరికి పెళ్లి చేయాలని పెద్దలు నిర్ణయించారు. బుధవారం శాంతినగర్ లో క్రైస్తవ మత సంప్రదాయం ప్రకారం వీళ్లిద్దరి పెళ్లి జరిగింది. వీరిద్దరి వివాహ వేడుకకు జనసేన పార్టీ రాష్ట్ర పీఏసీ సభ్యుడు పితాని బాలకృష్ణ హాజరు కావడం గమనార్హం. పెళ్లికి వచ్చిన అతిథులంతా నూతన జంటను నిండు మనసుతో ఆశీర్వదించారు.
    ఇది కూడా చదవండి: హైదరాబాద్ హాస్టల్లో ఘోరం.. నాన్నా.. నన్ను క్షమించు.. అన్నా.. నేను తప్పు చేయలేదురా అంటూ.. మెసేజ్ పెట్టి మరీ..
    Published by:Hasaan Kandula
    First published:

    Tags: Andhra Pradesh, Crime news, CYBER CRIME, East Godavari Dist, Love marriage

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు