నిర్లక్ష్యపు నీడలో గుంటూరు ధర్మాసుపత్రి

వైద్యులపై భౌతిక దాడులకు పాల్పడితే పదేళ్ల కఠిన శిక్ష అని ప్రభుత్వం చట్టం చేసింది. కానీ వైద్యుల నిర్లక్ష్యంతో చనిపోతే మాత్రం దానికి ఏం శిక్ష వేయాలని బాధితుల బంధువులు ప్రశ్నిస్తున్నారు.

news18-telugu
Updated: October 17, 2019, 8:52 PM IST
నిర్లక్ష్యపు నీడలో గుంటూరు ధర్మాసుపత్రి
గుంటూరు జనరల్ ఆస్పత్రి
  • Share this:
గుంటూరు జనరల్ హాస్పిటల్ అనేది గుంటూరు ప్రకాశం జిల్లాల ప్రజలకు ఆరోగ్య వరదాయిని.
ఈ హాస్పిటల్ కి అనుబంధంగా గుంటూరు మెడికల్ కాలేజ్ కూడా ఉంది. ఇక్కడ వైద్య విద్యను అభ్యసించిన వారు ఎంతో పేరు ప్రఖ్యాతలు గడించారు. వైద్యులుగా ప్రపంచ దేశాలలో స్థిరపడ్డారు. వారంతా కలసి తాము చదువుకున్న కళాశాలకు ఎదో ఒకటి చేయాలనే తలంపుతో "జింఖానా" అనే పేరుతో కోట్ల రూపాయల ఖర్చుతో ఎంతో ఆధునిక ఉపకారణాలతో సర్వాంగ సుందరంగా నిర్మించారు. కానీ, గుంటూరు జనరల్ హాస్పిటల్ వైద్యుల నిర్లక్ష్యం కారణంగా నెలలో నాలుగు నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి.

గత నెల రోజుల్లో ఆరోగ్యంగా పుట్టి కేవలం ఉమ్మనీరు తాగారనే కారణంతో ఇద్దరు పసి కందులు మరణించారు. తాజాగా మంగళవారం ఒక మహిళ మృతి చెందింది. పాతగుంటూరు కు చెందిన పావనిబాయికి సోమవారం కడుపు నొప్పితో బాధపడుతుండగా గుంటూరు జనరల్ హాస్పిటల్ అత్యవసర విభాగంలో చేర్పించారు. ఆమెను పరీక్షించిన వైద్యులు అపెండిసైటిస్ గా నిర్ధారించి మంగళవారం ఉదయం 8 గంటల ప్రాంతం లో ఆపరేషన్ రూమ్‌లోకి తీసుకు వెళ్లారు. గంట తరువాత ఆస్పత్రి సిబ్బంది... పావని బాబాయ్ కొండల రావు ను లోపలకి రావలసిందిగా కోరారు. పావని కడుపులో కొన్ని గడ్డలు ఉన్నాయని, వాటిని తీసేస్తే ప్రాణాపాయం ఉంటుందని చెప్పారు. ఆ తర్వాత ఆమెను మరో ఆపరేషన్ ధియేటర్‌కు తీసుకెళ్లారు. గడ్డను తొలగిస్తుండగా పావని చనిపోయిందంటూ ఆమె తల్లి శివపార్వతికి చెప్పారు. పోలీసుల నిర్లక్ష్యం వల్లే పావని చనిపోయిందంటూ బంధువులు, ప్రజాసంఘాల నాయకులూ గుంటూరు జనరల్ హాస్పిటల్ సూపరిండెంట్ ఛాంబర్ వద్ద ఆందోళన చేశారు. పావని కడుపులో గడ్డను కత్తిరించబోయి పేగును కత్తిరించడం వల్లే అధిక రక్తస్రావం జరిగినట్టు చెబుతున్నారు. మత్తు వైద్యుడి పొరపాటు కూడా బాధితురాలి మరణానికి కారణమని ఆరోపిస్తున్నారు.

ఈ ఘటన మరువక ముందే బుధవారం సరైన సమయానికి చికిత్స అందక నల్లచెరువుకు చెందిన షేక్ మహ్మద్ మృతి చెందాడు. నాలుగు రోజులుగా జ్వరంతో బాధపడుతున్న మహ్మద్ స్థానికంగా చికిత్స చేయించుకున్నారు. అక్కడ తగ్గకపోవడంతో గత సోమవారం గుంటూరు జనరల్ ఆస్పత్రిలో చేర్పించారు. అదే రోజు అతడికి పరీక్షలు నిర్వహించిన వైద్యులు ప్లేట్‌లెట్స్ 20వేలకు పడిపోయినట్టు చెప్పారు. కానీ, ప్లేట్‌లెట్స్‌కు సంబంధించి ఎలాంటి ట్రీట్‌మెంట్ ఇవ్వకుండా కేవలం సెలైన్లతో కాలం గడపడం వల్ల షేక్ మహ్మద్ చనిపోయాడని బాధితుడి బంధువులు ఆరోపించారు. దీనిపై సూపరిటెండెంట్‌కు ఫిర్యాదు చేయగా, విచారణ చేస్తామంటూ మొక్కుబడి సమాధానం ఇచ్చారు .

ఇటీవల వైద్యులపై భౌతిక దాడులకు పాల్పడితే పదేళ్ల కఠిన శిక్ష అని ప్రభుత్వం చట్టం చేయటాన్ని అందరూ హర్షించారు. కానీ వైద్యుల నిర్లక్ష్యంతో చనిపోతే మాత్రం దానికి ఏం శిక్ష వేయాలని బాధితుల బంధువులు ప్రశ్నిస్తున్నారు. ఆస్పత్రిలో ఎవరైనాచనిపోతే.. దానిపై కమిటీలు వేయడం, ఆ తర్వాత ‘మీతో మాకు, మాతో మీకు పనులుంటాయి.’ అని డాక్టర్లు సర్దుకుపోయి చివరకు సాగతీతల తర్వాత వైద్య పరిభాషలో అర్థం కాని రిపోర్టులు ఇస్తారనే అపవాదు కూడా వైద్యులపై ఉంది.

(రఘు అన్నా, గుంటూరు కరస్పాండెంట్, న్యూస్‌18)
First published: October 17, 2019, 8:52 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading