టీడీపీలోకి మాజీ కేంద్రమంత్రి కిశోర్ చంద్రదేవ్..త్వరలో ముహూర్తం

కిశోర్ చంద్రదేవ్ టీడీపీలో చేరతారని రాజకీయ వర్గాల్లో కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ఆ ఊహాగానాలను నిజం చేస్తూ..తాను టీడీపీలో చేరబోతున్నట్లు స్వయంగా ఆయనే ప్రకటించారు. కిశోర్ చంద్రదేవ్ లోక్‌సభ ఎంపీగా పోటీచేసే అవకాశమున్నట్లు సమాచారం.

news18-telugu
Updated: February 12, 2019, 5:49 PM IST
టీడీపీలోకి మాజీ కేంద్రమంత్రి కిశోర్ చంద్రదేవ్..త్వరలో ముహూర్తం
కిశోర్ చంద్రదేవ్, మాజీ కేంద్రమంత్రి
news18-telugu
Updated: February 12, 2019, 5:49 PM IST
అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఏపీ రాజకీయాలే వేడెక్కుతున్నాయి. నేతలు పార్టీ మార్పులు,చేరికలు జోరుగా సాగుతున్నాయి. కేంద్రమాజీ మంత్రి కిశోర్ చంద్రదేవ్ త్వరలో టీడీపీ గూటికి చేరున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ప్రకటించారు. ఢిల్లీలో పర్యటనలో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిని కిశోర్ చంద్రదేవ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రత్యేక హోదా సహా పలు రాజకీయ అంశాలపై చర్చించినట్లు సమాచారం. భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. టీడీపీలో చేరికను ధృవీకరించారు. ఏపీలో టీడీపీకి మరో ప్రత్యామ్నాయం లేదని, అందుకే తాను టీడీపీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఎన్నికల్లో పోటీ చేసే అంశంపై చర్చ జరగలేదని...చంద్రబాబు కోరితే ఎక్కడి నుంచైనా పోటీకి సిద్ధమన్నారు.

ఏపీలో టీడీపీ ప్రత్యామ్నాయం లేదు. చంద్రబాబు నాయకత్వంపై పూర్తి నమ్మకముంది. త్వరలో టీడీపీలో చేరుతా. పదవుల కోసం పార్టీ మారడం లేదు. పదవి కావాలనుకుంటే 2014లోనే టీడీపీలో చేరేవాడిని. ఎన్నికల్లో పోటీచేయాలని చంద్రబాబు కోరితే చేస్తా.
కిశోర్ చంద్రదేవ్, మాజీ కేంద్రమంత్రి
కాంగ్రెస్ పార్టీకి కిశోర్ చంద్రదేవ్ ఇటీవలే రాజీనామా చేశారు. కొన్నిరోజుల క్రితం విజయనగరం జిల్లాతో మాట్లాడిన ఆయన కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు. తాను కాంగ్రెస్‌కు రాజీనామా చేస్తున్నట్లు అప్పుడే ప్రకటించారు. దాంతో కిశోర్ టీడీపీలో చేరతారని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరిగింది. ఆ ఊహాగానాలను నిజంచేస్తూ..తాను టీడీపీలో చేరబోతున్నట్లు స్వయంగా ఆయనే ప్రకటించారు. కిశోర్ చంద్రదేవ్ లోక్‌సభ ఎంపీగా పోటీచేసే అవకాశమున్నట్లు సమాచారం.

కాగా, కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం పాటు ఉన్నారు కిశోర్ చంద్రదేవ్. ఐదు సార్లు లోక్‌సభకు, ఒకసారి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారు. 2009 సార్వత్రిక ఎన్నికల్లో అరకు లోక్‌సభ స్థానం నుంచి ఎంపీగా పోటీచేసి గెలిచారు. అనంతరం 2011 జులై నుంచి 2014 మే వరకు మన్మోహన్ సింగ్ కేబినెట్‌లో గిరిజన వ్యవహరాలు, పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా పనిచేశారు.

First published: February 12, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...