హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

కొడాలి నాని పేకాట క్లబ్బుల్లో భారీగా డబ్బు, కార్లు: దేవినేని సంచలన కామెంట్స్

కొడాలి నాని పేకాట క్లబ్బుల్లో భారీగా డబ్బు, కార్లు: దేవినేని సంచలన కామెంట్స్

దేవినేని ఉమ, కొడాలి నాని (ఫైల్)

దేవినేని ఉమ, కొడాలి నాని (ఫైల్)

మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నాయకుడు దేవినేని ఉమామహేశ్వరరావు (devineni Uma) సంచలన వ్యాఖ్యలు చేశారు.  రాష్ట్ర క్యాబినెట్ లో మంత్రిగా ఉన్న కొడాలి నాని ఆధ్వర్యంలో నడిపిస్తున్న పేకాట క్లబ్బులలో పోలీసులు ఇటీవల రైడింగ్ చేయగా.. అందులో భారీ ఎత్తున డబ్బు, కార్లు, వ్యక్తులు పట్టుబడ్డారని ఆయన ఆరోపించారు.

ఇంకా చదవండి ...
 • News18
 • Last Updated :

  ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నాయకుడు దేవినేని ఉమామహేశ్వరరావు (devineni Uma) సంచలన వ్యాఖ్యలు చేశారు.  రాష్ట్ర క్యాబినెట్ లో మంత్రిగా ఉన్న ఒక వ్యక్తి ఆధ్వర్యంలో నడిపిస్తున్న పేకాట క్లబ్బులలో పోలీసులు ఇటీవల రైడింగ్ చేయగా.. అందులో భారీ ఎత్తున డబ్బు, కార్లు, వ్యక్తులు పట్టుబడ్డారని ఆయన ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డి  క్యాబినెట్ లో ఉన్న మంత్రులే బయట పేకాట ఆడుతున్నారని ఆయన ఆరోపించారు.  ఒక నిజాయితీ పరుడైన పోలీస్ ఆఫీసర్ నలభై మంది పోలీసులతో సదరు మంత్రి గారి పేకాట క్లబ్బుపై దాడి చేస్తే.. అతడిని బూతులు తిట్టారని.. అక్కడ్నుంచి వెళ్లకుంటే చంపేస్తామని బెదిరించారని ఆరోపించారు.

  దేవినేని ఉమా  వ్యాఖ్యలు ఆయన మాటల్లోనే... ‘‘ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి (Jaganmohan reddy) క్యాబినెట్ లో మంత్రిగా ఉన్న కొడాలి నాని (kodali nani) ఆధ్వర్యంలో ఆడిస్తున్న పేకాట క్లబ్బుల్లో భారీ ఎత్తున డబ్బు, కార్లు, వ్యక్తులు పట్టుబడ్డారు. స్పాట్లో సంచుల్లో రూ. 10 కోట్ల రూపాయలు దొరికాయి. 60 మంది కూడా పట్టుబడ్డారు. సుమారు 30 కార్లు ఉన్నాయి. జగన్ మోహన్ రెడ్డి క్యాబినెట్ మంత్రులు లోపల, బయట పేకాట ఆడుతున్నారు. కొడాలి నాని 19 నెలలుగా ముఖ్య అనుచరులు విజయ్ మధు(మురళి) ల ఆధ్వర్యంలో ఎంట్రీ ఫీజు  రూ. 5,000 నెట్ క్యాష్, రూ. 2 లక్షల రూపాయలంటు పేకాట క్లబ్ నడిపిస్తున్నాడు. నిజాయితీపరుడయిన ఒక పోలీస్ అధికారి 40 మంది పోలీసులతో మంత్రి ఆడిస్తున్న పేకాట క్లబ్బుల పైన దాడి చేశారు. ఆ పోలీస్ అధికారిని బదిలీ చేస్తామని, బూతులు తిడుతూ ఆ డబ్బు కట్టల సంచులను వదిలేసి వెళ్లకపోతే చంపేస్తామని మంత్రి దగ్గరనుంచి బెదిరింపులు వెళుతున్నాయి..’ అని అన్నారు.

  ఇంకా ఆయన స్పందిస్తూ.. ‘ముఖ్యమంత్రికి దమ్ము, ధైర్యం ఉంటే మంత్రి కొడాలి నానిని వెంటనే బర్తరఫ్ చేయాలి. దీనిపై సమగ్ర విచారణ జరిపించాలి. నందివాడ మండలం దొండపాడు గ్రామ పరిధిలో ఏ మీడియా వారైనా ఫోన్ తీసుకొని వెళితే చంపేస్తామని బెదిరిస్తున్నారంటా.. ఒక సిన్సియర్ పోలీస్ అధికారి వెళ్లి మంత్రి కొడాలి నానికి అడ్డుకట్ట వేశారు. నిజాయితీపరుడైన ఆ పోలీస్ అధికారి కి హ్యాట్సాఫ్. రాత్రి ఎనిమిదింటికి మొదలైన పేకాట క్లబ్బులు తెల్లవారు జాము దాకా జరుగుతున్నాయట.. కొంతమంది గుడివాడ సినిమా పోలీసులు విజిల్ చేసుకుంటూ కర్ర కొట్టుకుంటూ ఆ కాలువ గట్టుల వద్దకు రమ్మని తిరుగుతున్నారు. ఇది 19 నెలలుగా జరుగుతుంది. కొడాలి నాని అడిస్తున్న లోనా బయట ఆటల వల్ల, కోత ముక్కల వల్ల చాలామంది ఆత్మహత్యలు చేసుకున్నారు. చాలామంది జీవితాలు బలి అయ్యాయి.. ‘ అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

  ఈ పేకాట క్లబ్బుల వల్ల చాలా మంది జీవితాలు నాశనమవుతున్నాయని ఉమా ఆవేదన వ్యక్తం చేశారు. ‘నూజివీడు లో కనకం అనే ఉద్యోగి అప్పులు చేసి ఇంట్లో బంగారం ఆస్తులు తాకట్టు పెట్టి పేకాట ఆడి అప్పులు కట్టలేక ఆత్మహత్య చేసుకున్నాడు. స్పాట్ లో దొరికిన ఆ పది కోట్ల రూపాయల డబ్బును, సీజ్ చేసిన 30 కారులను, ఆ 60 మంది వ్యక్తులను కోర్టులో హాజరు పరచాలి. దీనిమీద ప్రతిపక్షాలు, మీడియా వాళ్ళు మాట్లాడినా జగన్మోహన్ రెడ్డి గారి చెవికి ఎక్కలేదు. గుడివాడ నియోజకవర్గం నందివాడ మండలం, కమిర్ష దొండపాడు గ్రామం చంద్రయ్య కాలవ గట్టున అంకమ్మగూడెం వంతెన వద్ద ఆక్వా పొలాల్లో గత 19 నెలలుగా మంత్రి కొడాలి నాని ఆధ్వర్యంలో విజయ్, మధు(మురళి) అనే ఇద్దరు ఆధ్వర్యంలో లోన బయట ఆట ఆడిస్తున్నారు...’ అంటూ మండిపడ్డారు ఉమా.

  Published by:Srinivas Munigala
  First published:

  Tags: Andhrapradesh, Ap cm jagan, Ap cm ys jagan mohan reddy, AP News, Devineni uma, Gudivada, Kodali Nani, Vijayawada

  ఉత్తమ కథలు