హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

YS Viveka Murder: 'అప్పుడు జగన్ అలా అనలేదు..' వివేకా హత్య కేసుపై గౌతమ్ సవాంగ్ కీలక ప్రకటన..

YS Viveka Murder: 'అప్పుడు జగన్ అలా అనలేదు..' వివేకా హత్య కేసుపై గౌతమ్ సవాంగ్ కీలక ప్రకటన..

గౌతమ్ సవాంగ్ (ఫైల్)

గౌతమ్ సవాంగ్ (ఫైల్)

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు (YS Viveka Murder Case) హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. కేసులో సాక్షులు, నిందితులుగా చెబుతున్నవారు సీబీఐకి ఇచ్చిన స్టేట్ మెంట్స్ ఒక్కొక్కటిగా బయటకు వస్తుండటంతో రోజుకో మలుపు తిరుగుతోంది.

ఇంకా చదవండి ...

  ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు (YS Viveka Murder Case) హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. కేసులో సాక్షులు, నిందితులుగా చెబుతున్నవారు సీబీఐకి ఇచ్చిన స్టేట్ మెంట్స్ ఒక్కొక్కటిగా బయటకు వస్తుండటంతో రోజుకో మలుపు తిరుగుతోంది. ముఖ్యంగా వివేకా కుమార్తె సునీత, అల్లుడు రాజశేఖర్ రెడ్డి సీబీఐ దగ్గర ఇచ్చిన స్టేట్ మెంట్స్, అవినాష్ రెడ్డిపై అనుమానం వ్యక్తం చేస్తూ సునీత లోక్ సభ స్పీకర్ కు లేఖరాయడంతో వ్యవహారం మరింత వేడెక్కింది. అలాగే మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్ సమక్షంలోనే సీఎం జగన్ (AP CM YS Jagan) కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారంటూ వచ్చిన వార్తలు సంచలనం సృష్టించాయి.

  ఈ నేపథ్యంలో గౌతమ్ సవాంగ్ కీలక ప్రకటన చేశారు. ఈ కేసుకు సంబంధించి గతంలో తాను మాట్లాడానంటూ వచ్చిన వార్తలపై వివరణ ఇవ్వాల్సిన బాధ్యత ఉందన్న సవాంగ్.. పలు ఆరోపణలకు వివరణ ఇచ్చారు. వివేకా కేసుకు సంబంధించి సీఎం తనకు చెప్పిన విషయాలు సవాంగ్ వెల్లడించారు. ఈ కేసులో నిష్పక్షపాతంగా విచారణ జరిపాలని.. అసలైన దోషులకు శిక్షపడేలా చూడాలని ఎప్పుడూ చెప్పేవారని సవాంగ్ తెలిపారు. ఏనాడూ కేసు విచారణలో సీఎం జోక్యం చేసుకోలేదని స్పష్టం చేశారు. వివేకా కుటుంబం, అవినాష్ రెడ్డి కుటుంబం తనకు రెండు కళ్లలాంటివని మాత్రమే సీఎం చెప్పారని.. 2019లో సునీత, ఆమె భర్త రాజశేఖర్ రెడ్డి తనను కలిసినప్పుడు ఇదే మాట చెప్పానని వెల్లడించారు. ఇక తాను డీజీపీగా ఉన్న సమయంలో అవినాష్ రెడ్డి, సురేంద్రనాథ్ రెడ్డి, శివశంకర్ రెడ్డిలను ఒక్కసారి కూడా కలవలేదన్నారు.

  వివేకా హత్య కేసుపై గౌతమ్ సవాంగ్ కీలక ప్రకటన

  ఇది చదవండి: ఏపీకి భారీ వర్షసూచన.. ఈ జిల్లాలకు అలర్ట్.. వాతావరణ శాఖ హెచ్చరిక


  ఇదిలా ఉంటే ఇటీవల సీబీఐ విచారణలో సాక్షులు చెప్పినట్లు వస్తున్న వార్తలు మీడియాలో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. కేసులో వివేకా డ్రైవర్ దస్తగిరి అప్రూవర్ గా మారిన తర్వాత అనూహ్య మలుపులు తిరిగింది. ఎర్ర గంగిరెడ్డి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి తదితరులను నిందితులుగా పేర్కొన్న సీబీఐ వారిని అరెస్ట్ చేసింది. ఈ కేసులో భారీగా డబ్బులు చేతులు మారాయని.. అప్రూవర్ దస్తరిగిరి డబ్బులు కూడా ఆఫర్ చేశారన్న వార్తలు సంచలనం సృష్టించాయి.

  ఇది చదవండి: వేసవిలో ఏపీ విద్యుత్ ఉత్పత్తి, సరఫరా పరిస్థితేంటి..? అదే సీన్ రిపీట్ అవుతుందా..?


  మరోవైపు ఎంపీ అవినాష్ రెడ్డితో పాటు సీఎం జగన్ పై టీడీపీ ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో వైసీపీ కూడా గట్టిగానే కౌంటర్ ఇస్తోంది. మరోవైపు కేసులో ఆరోపణలెదుర్కొంటున్న దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి భార్య పలువురిపై సందేహాలు వ్యక్తం చేస్తూ కోర్టులో పిటిషన్ వేశారు. అలాగే వైసీపీ వైద్య విభాగం నేత అభిషేక్ రెడ్డి కూడా తాను సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలం అంటూ వచ్చిన వార్తలను ఖండించారు. ఇప్పుడు గౌతమ్ సవాంగ్ కూడా ప్రకటన విడుదల చేయడం చర్చనీయాంశమవుతోంది.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Gautam Sawang, Ys viveka murder case

  ఉత్తమ కథలు