బావిలో ఈత కొట్టిన మాజీ మంత్రి... చిన్న పిల్లలతో..

బావిలో ఈతకొడుతున్న రఘువీరారెడ్డి

మాజీ మంత్రి, ఏపీ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి చిన్న పిల్లాడిలా మారిపోయారు. గ్రామంలోని బావిలో చిన్న పిల్లలతో కలసి సరదాగా ఈతకొట్టారు.

 • Share this:
  మాజీ మంత్రి, ఏపీ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి చిన్న పిల్లాడిలా మారిపోయారు. గ్రామంలోని బావిలో చిన్న పిల్లలతో కలసి సరదాగా ఈతకొట్టారు. అనంతపురం జిల్లా నీలకంఠాపురం గ్రామ సమీపంలో ఉన్న రఘువీరారెడ్డి సొంత పొలంలో ఉన్న బావిలో ఈ రోజు ఆదివారం కావడంతో నీలకంఠాపురంలో ఉన్న బీసీ హాస్టల్ విద్యార్థులు ఈత కొడుతున్నారు. అదే సమయంలో రఘువీరా రోజు వారి క్రమంలో తన పొలం దగ్గర వ్యవసాయ పనులు చూసుకొంటూ వస్తున్నారు. ఆ సమయంలో బావిలో ఈత కొడుతున్న విద్యార్థులను చూశారు. దీంతో ఆయనలో కూడా ఈత కొట్టాలన్న కోరిక ఉదయించింది. ఒక్కసారిగా తన బాల్య స్నేహితులతో కలిసి ఈత కొట్టిన సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు. ఆ విద్యార్థులే తన స్నేహితులు అనుకోని వారితో కలిసి కొద్దిసేపు ఈత కొట్టారు. మధ్య మధ్యలో కొన్ని విన్యాసాలు చేశారు. సరదాగా ఆ విద్యార్థుల తో కాసేపు ఆడుకున్నారు.

  NTR Biopic, YSR Biopic, NTR Kathanayakudu, YSR Yatra Movie, AP Congress, Raghuveera Reddy, ఏపీ కాంగ్రెస్ పార్టీ, రఘువీరారెడ్డి, వైఎస్ఆర్ యాత్ర సినిమా, ఎన్టీఆర్ కథానాయకుడు బయోపిక్
  రఘువీరారెడ్డి( ఫేస్ బుక్ ఫోటో)


  ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత నవ్యాంధ్రకు ఆయనే పీసీసీ చీఫ్‌గా పనిచేశారు. కొన్ని రోజుల క్రితమే ఏపీలో కాంగ్రెస్ పార్టీ చీఫ్‌గా శైలజానాథ్‌ను నియమించింది. అంతకు ముందు రఘువీరారెడ్డి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేశారు. కొన్నాళ్లు రెవిన్యూ మంత్రిగా కూడా విధులు నిర్వర్తించారు. కాలేజీ రోజుల్లో ఎస్కే యూనివర్సిటీ విద్యార్థి సంఘం నాయకుడిగా కూడా పనిచేశారు.

  Published by:Ashok Kumar Bonepalli
  First published: