హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

టీటీడీ కీలక నిర్ణయం.. శ్రీవారి ఆలయ చరిత్రలోనే తొలిసారిగా..

టీటీడీ కీలక నిర్ణయం.. శ్రీవారి ఆలయ చరిత్రలోనే తొలిసారిగా..

తిరుమల ఆలయం

తిరుమల ఆలయం

శ్రీవేంకటేశ్వరుడు అల్లుడు గాను, తాళ్ళపాక వంశీకులు మామ స్థానంలో కన్యాదానం నిర్వహిస్తున్నారు. ఇలా కాలక్రమేణా శ్రీవారి కళ్యాణోత్సవానికి ప్రాధాన్యత అధికం కావడంతో నిత్య ఆర్జిత సేవగా రూపు దిద్దుకొంది.

  సర్వ జగత్ కళ్యాణగుణాకారకుడైన, సకల కళ్యాణ ప్రదాతగా కలియుగ వైకుంఠంలో శ్రీవేంకటేశ్వరుడు వెలిశాడు. శ్రీశ్రీనివాసుని క్షేత్రంలో నిత్య గోవింద నామ స్మరణతో నిత్యం పండగ సందడే. శ్రీవారికి నిత్యకళ్యాణోత్సవాన్ని టీటీడీ లోక కళ్యాణార్ధం నిర్వహిస్తోంది. ఎంతో క‌నుల పండుగ‌గా నిర్వ‌హించే ఈ క‌ళ్యాణం కరోనా వైరస్ కార‌ణంగా ఆన్‌లైన్‌లో నిర్వ‌హించేదుకు టీటీడీ స‌న్నాహాలు చేస్తోంది. ఆల‌య చ‌రిత్ర‌లో తొలిసారి ఆన్‌లైన్‌లో స్వామివారి క‌ళ్యాణాన్ని దేవస్థానం నిర్వ‌హించ‌బోతుంది. శ్రీవైఖనసా భగవత్ ఆగమ శాస్త్రం ప్రకారం శ్రీవారికి నిత్యోత్సవం, వారోత్సవం, పక్షోత్సవం, మసోత్సవం, సంవస్తారోత్సవాలను టీటీడీ వైభవంగా జరుపుతోంది. నిత్యోత్సవాలలో ముఖ్యమైన ఉత్సవం శ్రీవేంకటేశ్వరుని కళ్యాణోత్సవం.

  సాక్షాత్ ఆ ములమూర్తి ప్రతి రూపంగా భావించే శ్రీమలయప్ప స్వామి వారికి శ్రీదేవి, భూదేవిలకు కల్యాణోత్సవం నిర్వహిస్తారు. కళ్యాణోత్సవం ఇప్పటి ఆనవాయితీ కాదు. 15వ శతాబ్దంలో శ్రీపద్మావతి శ్రీనివాస కళ్యాణోత్సవం విశేష దినాల్లో, బ్రహ్మోత్సవ సమయంలో నిర్వహించే వారని పురాణాల ద్వారా తెలుస్తోంది. పదకవిత పితామహుడు, శ్రీవారి పరమ భక్తుడు అన్నమాచార్యులు కళ్యాణోత్సవాన్ని ప్రారంభించి.. తానే కన్యధాన దాతగా మారారు. అటు తర్వాత అన్నమయ్య కుమారులు తిరువెంకట నాథన్ 1546 సంవత్సరం నుంచి కళ్యాణోత్సవాన్ని పునఃప్రారంబించారు.

  అప్పట్లో శ్రీవారికి కళ్యాణోత్సవం ఐదు రోజులు మాత్రమే నిర్వహించే వారు. నిర్వహణ సమయంలో ప్రత్యేక నివేదనలు, నైవేద్యాలు స్వామి వారికి సమర్పించే వారు. పాల్గుణ మాసం అనురాధ నక్షత్రంతో ప్రారంభమైన ఉత్తరాషాఢ నక్షత్రం రోజు ముగిసేలా నిర్వహించే వారు. అప్పట్లో ఈ ఉత్సవానికి బహుమానంగా తమలపాకులు వక్కతో కూడిన తాంబూలము మాత్రమే ఇచ్చేవారు. 250 వరాహాలు వ్యయం సేవకు వినియోగించుకునే వారు.

  తుప్పిలి అగ్రహారం, నగరి సిరిమాను ప్రాంతానికి చెందిన అంబత్తూరు నుంచి వచ్చే 400 రేఖై నాణాలను ఉత్సవాలను వినియోగించుకునే వారు. కాలక్రమేణా రేఖై నాణేలు ఉత్సవ నిర్వహణకు సరిపోకపోవడంతో తీరు వెంగళనాథన్ స్వామి వారికి 470 రేఖ నాణేల సమర్పించే వారు. ఆయన హయాంలోనే 1558లో శ్రీవేంకటేశ్వరుని కళ్యాణోత్సవంలో మరిన్ని నైవేద్యాలతో, ధ్వజ రోహణ, అవరోహణతో కళ్యాణోత్సవ కార్యక్రమం నిర్వహించేవారు.

  పూర్వం బంగారు వాకిలి వద్ద, అటు తర్వాత రంగనాయకుల మండపంలో జరిగేది. కొన్నాళ్లకు విమాన ప్రకారంలోని పరకామణిలోని పాత కళ్యాణోత్సవ మండపం లోను.. అటు తర్వాత రంగనాయకుల మండపం.. నేడు సంపగి ప్రకారంలోని దక్షిణ దిక్కులో ఉన్న శ్రీవేంకటేశ్వరుని కళ్యాణ మండపంలో నిర్వహిస్తున్నారు. ఇప్పటికి శ్రీవేంకటేశ్వరుడు అల్లుడు గాను, తాళ్ళపాక వంశీకులు మామ స్థానంలో కన్యాదానం నిర్వహిస్తున్నారు. ఇలా కాలక్రమేణా శ్రీవారి కళ్యాణోత్సవానికి ప్రాధాన్యత అధికం కావడంతో నిత్య ఆర్జిత సేవగా రూపు దిద్దుకొంది.

  అన్నారవు కార్యనిర్వహణ అధికారిగా ఉన్న కాలంలో రూ.500 టిక్కెట్ తో కళ్యాణోత్సవానికి అనుమతించే వారు. నిత్యం స్వామి వారికి కళ్యాణం నిర్వహించగడంతో నిత్యకళ్యాణం పచ్చతోరణంగా మారింది తిరుమల క్షేత్రం. ప్రస్తుతం శ్రీపద్మావతి శ్రీనివాస కళ్యాణం టిక్కెట్లను రూ.వెయ్యికి భార్య భర్తలను మాత్రమే టీటీడీ అనుమతీస్తోంది. కళ్యాణోత్సవం చేయించిన దంపతులకు 1 పైపంచ, 1 జాకెట్టు ఇస్తోంది. ఎలాంటి సిఫార్సు లేకుండా నగదు చెల్లిస్తే రెండు పెద్ద లడ్డులు, రెండు వడలు, చిన్న లడ్డులు అందిస్తున్నారు.

  మానవాళి యోగక్షేమార్థం శ్రీపద్మావతి వెంకటేశ్వర కళ్యాణంను టీటీడీ నిర్వహిస్తోంది. యోగం అంటే సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుందని. క్షేమార్థం అంటే జీవితంలో కావాల్సిన కోర్కెలు తీర్చి... సుఖసంతోషాలు కలగాలంటే శ్రీవారి కళ్యాణంతో సిద్ధిస్తాయని భక్తుల విశ్వాసం. అందువల్లే తిరుమలకు శ్రీవారికి నిర్వహించే వివిధ సేవలకన్న కళ్యాణోత్సవ సేవలో ఎక్కువ మంది భక్తులు పాల్గొంటారు. రోజుకు వెయ్యి మంది భక్తులు పాల్గొనే విధంగా టీటీడీ చర్యలు తీసుకుంది. ప్రస్తుతం కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో శ్రీవారి కళ్యాణోత్సవాన్ని టీటీడీ ఏకాంతం చేసింది.

  ఒకే ప్రాంతంలో అధిక సంఖ్యలో భక్తులు గుమ్మి కుడితే కరోనా వ్యాప్తి చెందే అవకాశం ఉండటంతో అర్చకులు, పరిచారకులతో ఏకాంతంగా నిర్వహిస్తున్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనేందుకు ఆసక్తి చూపడంతో టీటీడీ వర్చువల్ కల్యాణానికి శ్రీకారం చుట్టాలని భావిస్తోంది. జూన్ మాసం నిర్వహించిన పాలకమండలి అత్యవసర సమావేశంలో ఆన్‌లైన్ కళ్యాణానికి పాలకమండలి ఆమోదం తెలిపింది. వర్చువల్ కళ్యాణోత్సవాన్ని నిర్వహించడం ద్వారా విశేష సంఖ్యలో భక్తులు స్వామి వారి కళ్యాణాన్ని వీక్షించి.., వారి మొక్కులు చెల్లింపునకు అవకాశం ఉంటుంది.

  ఇందుకు సంబంధించిన టీటీడీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. వర్చువల్ టిక్కెట్లను పొందిన భక్తులకు ఆన్‌లైన్ ద్వారా శ్రీవారి కళ్యాణోత్సవం వీక్షించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులకు పోస్టల్ ద్వారా ప్రసాదాన్ని పంపిణీ చేయాలని టీటీడీ భావిస్తోంది. అన్ని అనుకున్నట్లు జరిగితే స్వామి వారి వర్చువల్ సేవగా కళ్యాణోత్సవం ప్రథమం కావడం విశేషం.

  Published by:Anil
  First published:

  Tags: Tirumala news, Tirumala tirupati devasthanam, Ttd