Footpath Sales Ban: ఫుట్ పాత్ లపై అమ్మకం నిషేధం.. కాదంటే కఠిన చర్యలు.. ఎక్కడంటే

విశాఖలో పుట్ పాట్ చేపల అమ్మకం నిషేధం

Andhra Pradesh: మెట్రో నగరాల్లో ఫుట్ పాత్ వ్యాపారం ఎక్కువగా జరుగుతుంది. నగర జనాభా పెరగడంతో.. అందరికీ అందుబాటులో ఉండేది ఫుట్ పాత్ మార్కెట్ ఒక్కటే. కానీ ఇకపై అక్కడ ఫుట్ పాత్ పై అమ్మకానికి వీళ్లేదని ఆదేశాలు జారీ చేశారు..? ఎందుకో తెలుసా..?

  • Share this:
    Footpaths Ban: అందాల నగరంగా గుర్తింపు పొందిన విశాఖపట్నం (Viskhapatnam)లో పుట్ పాత్ వ్యాపారం కూడా భారీగానే జరుగుతోంది. ముఖ్యంగా సువిశాల సముద్ర తీరం.. ఫిష్పింగ్ హార్బర్లు ఉండడంతో.. చేపల అమ్మకాలు (Fish sales) ఎక్కువగా సాగుతుంటాయి. ఇకపై గ్రేటర్ విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఫుట్ పాత్ లపై చేపలను అమ్మడం పై నిషేధం విధించారు జీవీఎంసీ అధికారులు. తాజా నిషేధ ఆజ్ఞలను ఎవరైనా ఉల్లంగించడానికి లేదని స్పష్టం చేశారు. పొరపాటున ఎవరైనా ఫుట్ పాత్ లపై చేపలు అమ్మడం (Foot path fihs market) మొదలు పెడితే.. అటువంటి వారికి జరిమానా విధించడంతోపాటు.. అలా ఫుట్‌పాత్‌లపై చేపలను అమ్ముతున్నవారిపై చర్యలు తీసుకోనున్నారు. అంతేకాదు.. చేపల విక్రేతలపై చర్యలు తీసుకోవడంలో విఫలమైతే వార్డ్ శానిటరీ ఇన్స్‌పెక్టర్‌లపై కఠిన చర్యలు తీసుకునేందుకు కూడా వెనుకాడం అంటున్నారు. ప్రస్తుతం నగరంలో ఫుట్ పాత్ లపై చేపల అమ్మకం భారీగా సాగుతుంది. దాదాపు 600కి పైగా అమ్మకందారులు ఇలా ఫుట్ పాత్ లపై వ్యాపారలావాదేవీలు కొనసాగిస్తున్నారని జీవీఎంసీ వెటర్నరీ ఆఫీసర్ చెబుతున్నారు. విశాఖపట్నం జాయింట్ కలెక్టర్ బంగ్లా ముందు ఉన్న ఫుట్‌పాత్‌పై కూడా చేపలను అమ్ముతున్నారని చెప్పారు.

    జీవీఎంసీ కమీషనర్ సృజన  (GVMC Commissioner srujana)ఎంవిపి కాలనీని సందర్శిస్తున్న సమయంలో అక్కడ ఫుట్‌పాత్‌లపై చేపలను అమ్ముతున్నట్లు గుర్తించారు.
    ఈ స్థలం పాదచారుల కోసం ఉద్దేశించబడింది.. ఇక్కడ అమ్మడం సరైంది కాదని సూచించారు. వెంటనే వారంతా ఈ ఫుట్ పాత్ లను వదిలేయాని కోరారు.. ప్రత్యేక ఏర్పాట్లపై ఆమె హామీ ఇచ్చారు. సరైన ప్రదేశం చూసి వారికి ఉచితంగా అందించాలని ఆమె శానిటరీ ఇన్‌స్పెక్టర్లను కోరారు.

    ఈ సందర్భంగా మత్స్య కార్మికుల నాయకులు మాట్లాడుతూ.. నగరంలో చేపల అమ్మకానికి 32 మార్కెట్లు ఉన్నాయన్నారు.అయితే మత్స్యకారులు, చేపల విక్రేతల కోసం ప్రభుత్వం మరిన్ని హాకర్ జోన్‌లను ప్రవేశపెట్టాలని కోరారు. అలా చేస్తేనే వీధుల్లో, పబ్లిక్ రోడ్లలో చేపలను విక్రయించే పద్ధతిని నిలిపివేయవచ్చని చెప్పారు. దీనిపై ఫుట్ పాత్ వ్యాపారులు ఎలా స్పందిస్తారో చూడాలి..

    నగరంలోని చైనా వాల్‌టెయిర్, అప్పుఘర్, రామలక్ష్మి అపార్ట్‌మెంట్స్ జంక్షన్, BRTS రోడ్, విశాలాక్షి నగర్, సీతమ్మధార, MVP కాలనీ, మురళీ నగర్, గాజువాక, KRM కాలనీ, HB కాలనీ, సింహాచలం, వేపగుంటలో ఫుట్ పాత్ లపై చేపల అమ్మకం సర్వసాధారణంగా కనిపిస్తుంటుంది. అయితే ఇకపై అలా అమ్మడానికి వీళ్లేదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఎవరైనా రూల్స్ అధిగమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు.

    ఫుట్ పాత్ వ్యాపారులు మాత్రం తమ పొట్టకొట్టొద్దని అధికారులను వేడుకుంటున్నారు. చాలా ఏళ్లుగా ఇదే తమ జీవన ఆధారమని.. ఇప్పుడు నిషేధం అంటే తాము ఎలా బతకాలని అధికారులను వేడుకుంటున్నారు. కానీ అధికారులు మాత్రం ససేమిరా ఒప్పుకునేది లేదని చెబుతున్నారు. మరి ఈ ఆదేశాలు ఎంత వరకు అమలవుతాయో చూడాలి..
    Published by:Nagesh Paina
    First published: