Home /News /andhra-pradesh /

FOCUS ON FARMERS PROBLEM NARA LOKESH WRITE LETTER TO CM YS JAGAN MOHAN REDDY AK

అలా చేయకపోతే.. ఫస్ట్ ప్లేస్‌కు ఆంధ్రప్రదేశ్.. జగన్‌కు లోకేశ్ లేఖ

నారా లోకేష్, వైఎస్ జగన్(ఫైల్ ఫోటో)

నారా లోకేష్, వైఎస్ జగన్(ఫైల్ ఫోటో)

Nara Lokesh: వైసీపీ ప్రభుత్వ పాలనలో రైతు ఆత్మహత్యల్లో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో ఉందన్న లోకేశ్.. కౌలు రైతుల ఆత్మహత్యల్లో రాష్ట్రం 2వ స్థానంలో ఉందని తెలిపారు.

    రాష్ట్రంలో తీవ్రంగా నష్టపోతున్న రైతాంగాన్ని ఆదుకునే దిశ‌గా చర్యలు తీసుకోవాలని టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. ఈ మేరకు ఆయన సీఎం జగన్‌కు లేఖ రాశారు. లేదంటే ఇప్పటికే రైతుల ఆత్మహత్యల్లో 3వ స్థానానికి చేరిన ఏపీ మొద‌టిస్థానానికి చేరే ఆందోళ‌న‌క‌ర ప‌రిస్థితులు క‌నిపిస్తున్నాయని అన్నారు. ముఖ్యంగా అనంత‌పురం జిల్లాలోని వేరుశ‌న‌గ రైతుల ప‌రిస్థితి చాలా అధ్వానంగా వుందని లోకేశ్ అన్నారు. నీరులేక పంట‌ ఎండిపోతుండ‌టంతో రైతులు తీవ్ర ఆందోళ‌న‌లో వున్నారని లేఖలో పేర్కొన్నారు. పంట సాగు చేసిన తర్వాత వరుస వర్షాలతో దిగుబడిపై ఆశలు ఊరించాయని... అయితే ఇప్పుడు ఎండ తీవ్రత రైతులను ఆందోళనకు గురిచేస్తోందని అన్నారు.

    త‌క్షణమే ప్రభుత్వం స్పందించి పంట ర‌క్షించుకునేందుకు త‌డులు అందించే ఏర్పాటు చేయాల్సిన అత్యవసరం ఉందని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వేరుశెనగ నష్టంపై ఎన్యూమరేషన్ నిర్వహించాలని అన్నారు. ఇప్పటికే వైసీపీ ప్రభుత్వ పాలనలో రైతు ఆత్మహత్యల్లో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో ఉందన్న లోకేశ్.. కౌలు రైతుల ఆత్మహత్యల్లో రాష్ట్రం 2వ స్థానంలో ఉందని తెలిపారు. రైతుల్ని ఆదుకోక‌పోతే అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ ఆత్మహత్యల ఆంధ్రప్రదేశ్‌గా మారిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, Nara Lokesh

    తదుపరి వార్తలు