Miracle groud Water: రాయలసీమ (Rayalaseema) అంటే కరవుకు కేరాఫ్.. వర్షాకాలంలో చుక్క నీరు దొరకడం గగనం.. సరైన నీరు లేక.. వేయి అడుగుల లోతున బోరు తవ్వినా చుక్క నీరు రాని సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కానీ ఇప్పుడు కరవు సీమలో కురిసిన భారీ వర్షాలతో (Heavy rains) అన్నదాతల మోముల్లో ఆనందాలు వెల్లివిరుస్తున్నాయి. గతంలో గుప్పెడు నీరు కోసం వెయ్యి అడుగుల బోరు వేసేవారు. అయినా చుక్క నీరు రాక.. ఆ బోర్లను మూసేసిన సందర్బాలు ఎన్నో.. అలాంటి ప్రదేశంలో పాతాళగంగమ్మ ఇప్పుడు తనంతట తానే పుడమి నుంచి ఉబికి పైకి వస్తుండడంతో రైతులు (Farmers) సంబరపడిపోతున్నారు. అది కూడా ఎలాంటి మోటార్ సహాయం లేకుండానే బోర్ల నుంచి నీరు ఉబికి ఉబికి వస్తోంది. ఆ నీటిని చూసిన వారంత ఇది కలయా లేక నిజమా.. అని తేల్చుకోలేకపోతున్నారు. కరవు సీమగా పేరొందిన రాయలసీమలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు భూగర్భ జలాలు బాగా మెరుగుపడ్డాయి. అయితే విచిత్రం ఏంటంటే.. నీరు రావడం లేదని.. వేసిన బోర్లను కప్పేసి వదిలేసిన చోట కూడా.. దానంతట అదే నీరు ఉబికి వస్తోంది..
తాజాగా అనంతపురం (Anantapuram)కు చెందిన పీసీసీ మాజీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి (Raghuveera Reddy) సొంత పొలంలోనే ఈ అద్భుత దృశ్యం సాక్షాత్కారమైంది. అనంతపురం జిల్లా మడకశిర మండలం నీలకంఠపురంలోని రఘువీరారెడ్డి పొలంలో బోరు బావి నుంచి ఉబికివస్తోన్న నీటిని చూసి చుట్టుపక్కల రైతులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇదే ప్రదేశంలో చాలాసార్లు 900 అడుగుల లోతులో బోర్లు వేసినా ఒక్కటంటే ఒక్క చుక్కనీరు పడలేదని.. అలాంటి చోట కనీసం బోరు ఆన్ చేయకుండానే.. అసలు మోటార్ అమర్చవలసిన అవసరం లేకుండానే నీళ్లు పైకి వస్తున్నాయి.. దీంతో ఇది ఎలా సాధ్యమైంది అంటూ అంతా ఆశ్చర్యపోతున్నారు.. అసలు మోటర్ లేకుండా దానంత అదే నీరు వస్తోందో అర్థం కావడం లేదంటున్నారు..
What a Wonder || 1000 అడుగులు తవ్వినా రాని చుక్క నీరు || మూసేస్తే ఉబికి ... https://t.co/nEaVpLE61l via @YouTube #APFloods #AndhraPradesh #AndhraPradeshFloods #AndhraPradeshRains @drnraghuveera
— nagesh Journlist (@nageshzee) November 26, 2021
ఇక ఈ అద్భుతమైన రఘువీరారెడ్డి ఆనందంగా స్పందించారు. తన జీవితంలో ఎప్పుడూ ఇలాంటి అద్భుతం చూడలేదంటున్నారు. తాను ప్రజా ప్రతినిధిగా ఉన్నప్పుడు మడకశిర పంచాయతీలో తాగునీటి కోసం ఎన్నో బోర్లు వేయించానని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. తాజా వర్షాలతో మరో ఐదేళ్ల పాటు భూగర్భ జలాలకు ఢోకా లేదంటూ రఘువీరా హర్షం వ్యక్తం చేస్తున్నారు. మడకశిర మండలంలోని చాలా ప్రాంతాల్లో ఇలాంటి అద్భుత సంఘటనలే కనిపిస్తున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మంత్రిగా పనిచేసిన రఘువీరా రెడ్డి రాష్ట్ర విభజన తరువాత కూడా ఏపీ పీసీసీ అధ్యక్షుడిగా సేవలందించారు. వివాద రహితుడు, సౌమ్యుడిగా ఆయనకు పేరుంది. గత కొంత కాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటోన్న ఆయన వ్యవసాయం చేస్తూ.. సాధారణ జీవితం గడుపుతున్నారు.
ఇదీ చదవండి : రాష్ట్రాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిదీ.. కౌరవసభలో అడుగు పెట్టనన్న చంద్రబాబు..
రాయలసీమలో తాజా వరదలు, వర్షాలపై సీఎం జగన్ సైతం అసెంబ్లీలో స్పందించారు. మొన్నటి వరకు నీళ్లు లేక అలమటించే రాయలసీమలో అనూహ్య వరదలు సంభవించాయి అన్నారు. పింఛ, అన్నమయ్య రిజర్వాయర్ల కట్టలు తెగిపోయాయని, చెయ్యేరు నది పరివాహక ప్రాంతం గ్రామాలు జలదిగ్భంధం అయ్యాయన్నారు. ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లు వానలు కురిశాయని, 3.2 క్యూసెక్కుల వర్షం చెయ్యేరు నుంచి విరుచుకుపడిందన్నారు. కొన్ని చోట్ల ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరిగిందని, నష్టం వివరాలను ఎక్కడ దాచడం లేదని స్పష్టం చేశారు. సహాయం అందించడంలో ఎక్కడా వెనకడుగు వేయలేదని పేర్కొంటూ చంద్రబాబు విమర్శలకు కౌంటర్ ఇచ్చారు.
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Anantapuram, Andhra Pradesh, AP Floods, AP News, Raghuveera Reddy