Andhra Pradesh flood Politics: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లలో వరద రాజకీయాల రచ్చ రచ్చ అవుతున్నాయి. ఇటీవల వానలు ముంచెత్తాయి.. కానీ వరద భయం (AP Floods)ఇంకా వీడలేదు. రాయలసీమలో దాదాపు అన్ని జిల్లాల్లోనూ అదే పరిస్థితి ఉంది. ముఖ్యంగా తిరుపతి (Tirupati) సమీపంలోని రాయల చెరువు కట్టకు పడిన లీకేజీలను పూడ్చడం ఆలస్యం అవ్వడంతో పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ప్రభుత్వం తీరుకు నిరసన తెలుపుతూ.. వెంటనే పూడ్చి, స్థానికుల్లో నెలకొన్న భయాందోళనలు తొలగించాలని ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు (Chandrababu naidu) డిమాండ్ చేస్తున్నారు. ఆయన స్వయంగా రాయల చెరువును పరిశీలించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ తీరుపైా, ప్రభుత్వం తీరుపైనా తీవ్ర విమర్శలు చేశారు. గాల్లోనే వచ్చిన సీఎం గాల్లోనే వెళ్లిపోయారంటూ విమర్శలు చేశారు..
చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలకు సీఎం జగన్ ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు ఏ పర్యటనకు వెళ్లారు.. ఏం మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. తనను వ్యతిరేకించినందుకు వైఎస్ఆర్ కాలగర్భంలో కలిసిపోయారని చంద్రబాబు అంటున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు జగన్. ఆయన సంస్కారానికి నా నమస్కారం అంటూ జగన్ మండిపడ్డారు. తాను గాల్లోనే వెళ్లి.. గాల్లోనూ వచ్చాసాను అని చేసిన చంద్రబాబు వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు.
వరద ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి అన్నారు. అధికారులంతా ఆ పనుల్లో బిజీగా ఉన్నారని.. ఒక వేళ సీఎం అక్కడి వెళ్తే.. అధికారులంతా సహాయ చర్యలపై కాకుండా.. సీఎం ఏర్పాట్లలో ఫోకస్ పెడతారని.. దీంతో బాధితులు ఇబ్బంది పడే అవకాశం ఉందన్నారు జగన్. అయినా వరద ప్రాంతాల్లో సహాయక చర్యలు.. పరిహారాల గురించి అధికారులకు అన్ని ఆదేశాలు జారీ చేశామన్నారు జగన్.
ఇదీ చదవండి : నాకు జరిగిన అవమానం మరెవరికీ జరగకూడదు.. అసెంబ్లీ ఘటనపై భువనేశ్వరి రియాక్షన్ ఇదే..
ఇటీవల కురిసిన వర్షాలకు మూడు జిల్లాలో తీవ్ర నష్టం సంభవించిందని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. గడిచిన వంద ఏళ్లలో కనీవినీ ఎరుగని వానలు కురిశాయన్నారు. వానలు రాయలసీమను ముంచెత్తడం చరిత్రలో తాను ఎప్పుడూ జరగలేదన్నారు. అయినా కడప జిల్లాలకు వెళ్లిన చంద్రబాబు.. తనపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉంది అన్నారు. తాను అధికారంలో ఉన్నప్పుడు లేనప్పుడూ సొంత జిల్లాపై ఎప్పుడూ ప్రేమ దాచుకోలేదు అన్నారు సీఎం జగన్.
ఇదీ చదవండి : అమ్మా టీ చాలా బాగుంది.. ఓడిపోయిన చోటే నెగ్గాలి అంటున్న లోకేష్
మొన్నటి వరకు నీళ్లు లేక అలమటించే రాయలసీమలో అనూహ్య వరదలు సంభవించాయి అన్నారు జగన్. పింఛ, అన్నమయ్య రిజర్వాయర్ల కట్టలు తెగిపోయాయని, చెయ్యేరు నది పరివాహక ప్రాంతం గ్రామాలు జలదిగ్భంధం అయ్యాయన్నారు.
ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లు వానలు కురిశాయని, 3.2 క్యూసెక్కుల వర్షం చెయ్యేరు నుంచి విరుచుకుపడిందన్నారు. కొన్ని చోట్ల ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరిగిందని, నష్టం వివరాలను ఎక్కడ దాచడం లేదని స్పష్టం చేశారు. సహాయం అందించడంలో ఎక్కడా వెనకడుగు వేయలేదని పేర్కొంటూ చంద్రబాబు విమర్శలకు కౌంటర్ ఇచ్చారు.
(Read all the Latest News, Breaking (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on
Facebook, Twitter and Google News)
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP Floods, AP News, Chandrababu Naidu, Cm jagan