హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Kakinada Boat Fire: సముద్రంలో మత్స్యకారుల బోటు దగ్ధం.. భారీగా మంటలు

Kakinada Boat Fire: సముద్రంలో మత్స్యకారుల బోటు దగ్ధం.. భారీగా మంటలు

తగలబడుతున్న బోటు

తగలబడుతున్న బోటు

Kakinada boat Fire: కాకినాడ పోర్టు వద్ద ముగ్గురు మత్స్యకారులు తమ బోటులో ఇంధనం నింపారు. అనంతరం ఇంజిన్ స్టార్ట్ చేసేందుకు ప్రయత్నించారు. ఐతే ప్రమాదవశాత్తు పెట్రోల్ ఒలికిపోయి మంటలు అంటుకున్నాయి.

  తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో అగ్రిప్రమాదం జరిగింది. కాకినాడ పోర్టులో మత్స్యకారుల బోటుకు మంటల్లో చిక్కుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు జాలర్లకు గాయాలయ్యాయి. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించడంతో ప్రాణ నష్టం తప్పింది. కాకినాడ పోర్టు వద్ద పంతాటి కామేశ్వరరావు అనే వ్యక్తి తన బోటులో సుమారు 4 వేల లీటర్ల డీజిల్ నింపారు. అనంతరం చేపల వేటకు వెళ్లేందుకు ఇంజిన్ స్టార్ట్ చేసేందుకు ప్రయత్నించారు. ఐతే ప్రమాదవశాత్తు పెట్రోల్ ఒలికిపోయి మంటలు అంటుకున్నాయి. చూస్తుండగానే క్షణాల్లోనే బోటు మొత్తం విస్తరించాయి. చెక్క బోటు కావడంతో మంటలు పెద్ద ఎత్తున ఎగిసిపడ్డాయి.

  ప్రమాద సమయంలో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. మంటల చెలరేగడంతో.. లోపలే చిక్కుకుపోయిన మత్స్యకారులు హాహాకారాలు చేశారు. అక్కడికి కొద్ది దూరంలోనే ఉన్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. స్థానికుల సాయంతో వారిని క్షేమంగా బయటకు తీసుకొచ్చారు.


  సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి వెళ్లి మంటలను అదుపు చేశారు. కొన్ని నిమిషాల పాటు మంటల మధ్యే ఉండడంతో ముగ్గురికీ గాయాలయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. విశాఖకు చెందిన బొడ్డు నూకరాజు అనే వ్యక్తికి తీవ్ర గాయాలయినట్లు తెలుస్తోంది. ఇక ప్రమాదంలో బోటు మొత్తం కాలిపోయింది. ఘటనపై కాకినాడ పోర్టు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొదుతున్న క్షతగాత్రులను ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌ రెడ్డి పరామర్శించారు.

  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Fire Accident, Kakinada

  ఉత్తమ కథలు