తెలుగు రాష్ట్రాలకు తొలి ప్రైవేటు రైలు వచ్చేస్తోంది... ఎక్కడి నుంచి ఎక్కడికంటే...

ప్రస్తుతం హైదరాబాద్ నుంచి వెంకటాద్రి, నారాయణాద్రి, పద్మావతి, రాయలసీమ ఎక్స్ ప్రెస్, కృష్ణా ఎక్స్ ప్రెస్, శబరి ఎక్స్ ప్రెస్ తదితర రైళ్లతో పాటు కొన్ని స్పెషల్ రైళ్లు కూడా తిరుపతికి వెళుతుంటాయి.

news18-telugu
Updated: February 16, 2020, 5:27 PM IST
తెలుగు రాష్ట్రాలకు తొలి ప్రైవేటు రైలు వచ్చేస్తోంది... ఎక్కడి నుంచి ఎక్కడికంటే...
ప్రతీకాత్మక చిత్రం (image: IRCTC)
  • Share this:
దేశవ్యాప్తంగా 100 మార్గాల్లో 150 ప్రైవేటు రైళ్లను నడిపించేందుకు రైల్వే శాఖ సిద్ధమైన నేపథ్యంలో, తెలుగు రాష్ట్రాల్లో తొలి రైలు హైదరాబాద్ పరిధిలోని లింగంపల్లి నుంచి తిరుపతి మధ్య నడవనుంది. ఐదు నెలల క్రితం న్యూఢిల్లీ నుంచి లక్నో మధ్య, ఆపై ముంబై నుంచి అహ్మదాబాద్ మధ్య తేజస్ రైళ్లు ప్రారంభమైన సంగతి తెలిసిందే. అతి త్వరలో ఇండోర్ నుంచి వారణాసి మధ్య కూడా తేజస్ నడవనుంది. ఈ రైళ్లకు మంచి ఆదరణ లభిస్తోంది. ఏదైనా కారణంతో రైలు గమ్యస్థానాన్ని చేరడంలో జాప్యం జరిగితే, ప్రయాణికులకు రూ. 250 వరకూ పరిహారం లభిస్తుంది. ఈ పరిహారాన్ని రైలును లీజుకు తీసుకున్న సంస్థకు బదులుగా, ఐఆర్సీటీసీ ఇవ్వాల్సి వుంటుంది. ఈ నేపథ్యంలో ఐఆర్సీటీసీపై భారాన్ని తొలగించేందుకు ప్రైవేటు రైళ్లు వస్తుంటే, మిగతా రైళ్లను మరింత ఆలస్యంగా నడిపిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి.

IRCTC Tejas Express, Indian Railways Private Train, IRCTC Tejas Express Ahmedabad Mumbai, IRCTC Tejas Express time table, IRCTC Tejas Express booking, IRCTC Tejas Express fare, IRCTC Tejas Express route, IRCTC Tejas Express lucknow new delhi, ఐఆర్‌సీటీసీ తేజస్ ఎక్స్‌ప్రెస్, ఇండియన్ రైల్వేస్ ప్రైవేట్ రైలు, ఐఆర్‌సీటీసీ తేజస్ ఎక్స్‌ప్రెస్ అహ్మదాబాద్ ముంబై, ఐఆర్‌సీటీసీ తేజస్ ఎక్స్‌ప్రెస్ టైమ్ టేబుల్, ఐఆర్‌సీటీసీ తేజస్ ఎక్స్‌ప్రెస్ బుకింగ్, ఐఆర్‌సీటీసీ తేజస్ ఎక్స్‌ప్రెస్ ఛార్జీలు, ఐఆర్‌సీటీసీ తేజస్ ఎక్స్‌ప్రెస్ రూట్, ఐఆర్‌సీటీసీ తేజస్ ఎక్స్‌ప్రెస్ లక్నో న్యూ ఢిల్లీ
ప్రతీకాత్మక చిత్రం (image: IRCTC)


ప్రస్తుతం హైదరాబాద్ నుంచి తిరుపతి మధ్య 8 రైళ్లు నడుస్తున్నాయి. ఇవన్నీ ప్రతి రోజూ కిటకిటలాడుతూ ప్రయాణించేవే. వెంకటాద్రి, నారాయణాద్రి, పద్మావతి, రాయలసీమ ఎక్స్ ప్రెస్, కృష్ణా ఎక్స్ ప్రెస్, శబరి ఎక్స్ ప్రెస్ తదితర రైళ్లతో పాటు కొన్ని స్పెషల్ రైళ్లు కూడా తిరుపతికి వెళుతుంటాయి. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 11 ప్రైవేటు రైళ్లకు అనుమతి లభించగా, తొలి టెండర్ తిరుపతికి ప్రయాణించే రైలుకు పిలవాలని అధికారులు నిర్ణయించినట్టు సమాచారం. ఈ రైళ్లలో చార్జీలు అధికంగా ఉంటాయి. సీట్లు నిండుతున్న కొద్దీ ధర పెరుగుతూ ఉంటుంది.

కరీంనగర్‌లో ఘోరం.. వంతెనపై నుంచి పడిపోతున్న కానిస్టేబుల్First published: February 16, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు