హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Anandayya Medicine: ఆనందయ్య మందుపై తొలి దశ అధ్యయనం పూర్తి.. రెండో దశలో..

Anandayya Medicine: ఆనందయ్య మందుపై తొలి దశ అధ్యయనం పూర్తి.. రెండో దశలో..

సోమవారం 3 రకాల మందు ఉన్న కిట్‌ లను ప్రజలకు అందించాలని భావిస్తున్నారు. ప్రస్తుతం ఆయన మందుకు ‘ఔషధ చక్రం’ అని పేరు పెట్టారు. తమ గురువుల సహకారంతో 30 ఏళ్లుగా అనారోగ్యానికి గురైన వారికి ఆయుర్వేద మందు అందజేస్తున్నామని ఆనందయ్య అంటున్నారు. కరోనా నివారణకు తాము తయారు చేసిన మందు పేరు ‘ఔషధ చక్రం’ అని తెలిపారు.

Anandayya Medicine: ఆనందయ్య మందును ప్రజలకు ఎప్పటి నుంచి పంపిణీ చేస్తారనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది.

  కరోనా మహమ్మారిని కట్టడి చేయడంలో సమర్థవంతంగా పని చేస్తుందని చాలామంది నమ్ముతున్న ఆనందయ్య మందుపై అధ్యయనం కొనసాగుతోంది. తాజాగా ఈ మందుపై సీసీఆర్ఏఎస్ తొలి దశ అధ్యయనం పూర్తయ్యింది. సీసీఆర్ఏఎస్ ఆదేశాల మేరకు రెస్ట్రోపెక్టివ్ స్టడీని ఆయుర్వేద వైద్యులు చేసిన నివేదిక అందజేశారు. మందు తీసుకున్న 570 మందిని ఫోన్లో సంప్రదించిన వైద్యులు.. వారి నుంచి అభిప్రాయాలు సేకరించారు. మలిదశ ప్రయోగాలకు అవసరమైన అనుమతుల కోసం వేచి చూస్తున్నారు. సీసీఆర్ఏఎస్ తదుపరి ఆదేశాలు అందిన వెంటనే తర్వాతి రెండో దశ ప్రయోగాలు ప్రారంభించనున్నారు. సుజన్‌ ల్యాబ్‌లో జంతువులపై ప్రీ క్లినికల్ ట్రయల్స్‌ నిర్వహించనున్నారు. సుజన్‌ లైఫ్ ల్యాబ్‌ నుంచి 15 రోజుల్లో నివేదిక వచ్చే అవకాశం ఉంది.

  ఆనందయ్య మందుపై మరో రెండురోజుల్లో పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉందన్నారు టీటీడీ పాలకమండలి సభ్యులు, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ఇప్పటికే ఆనందయ్య కుటుంబంతో మాట్లామన్న చెవిరెడ్డి.. మందుకు సంబంధించిన పూర్తి వివరాలు సేకరించినట్లు తెలిపారు. ఈ ఔషధం పట్ల పాజిటివ్ రిపోర్ట్ వస్తే మందు తయారీ, పంపిణీకి ముద్ధ ప్రతిపదికన సన్నాహాలు చేస్తున్నట్లు వెల్లడించారు.

  ఇక ఆనందయ్య మందును ప్రజలకు ఎప్పటి నుంచి పంపిణీ చేస్తారనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఇప్పటికే ఆయుష్‌ కమిషనర్, ఆయుర్వేద వైద్య నిపుణులు ఆనందయ్య మందు నమూనాలు సేకరించి తమ అభిప్రాయం చెప్పారు. అయితే పూర్తి స్థాయి నివేదిక‌లు వ‌చ్చే వ‌రకు ప్రభుత్వం ఈ మందు పంపిణీని నిలిపివేసింది.

  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: Anandaiah corona medicine, Andhra Pradesh

  ఉత్తమ కథలు