విశాఖ ఏజెన్సీలో అలజడి..పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు

జీకే వీధి, కొయ్యూరు మండలాల సరిహద్దులో గ్రేహౌండ్స్, స్పెషల్ పార్టీ పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. అడవుల్లో కూంబింగ్ నిర్వహిస్తుండగా సోమవారం మధ్యాహ్నం మావోయిస్టులు తారసపడ్డారు. లొంగిపోవాలని హెచ్చరించినప్పటికీ మావోయిస్టులు కాల్పులు జరపడంతో భద్రతా దళాలు ఎదురు కాల్పులు జరిపాయి.

news18-telugu
Updated: August 19, 2019, 6:49 PM IST
విశాఖ ఏజెన్సీలో అలజడి..పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
విశాఖ ఏజెన్సీలో అలజడి రేగింది. జీకే వీధి-కొయ్యూరు మండలాల సరిహద్దులో పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. మండపల్లి అటవీ ప్రాంతంలో 45 నిమిషాల పాటు ఇరు వర్గాల మధ్య కాల్పులు జరిగినట్లు తెలుస్తోంది. మావోయిస్టలు అగ్రనేత చలపలి ఆధ్వర్యంలో 20 మంది మావోయిస్టులు మండపల్లి ప్రాంతంలో సమావేశమవుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఈ నేపథ్యంలో జీకే వీధి, కొయ్యూరు మండలాల సరిహద్దులో గ్రేహౌండ్స్, స్పెషల్ పార్టీ పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. అడవుల్లో కూంబింగ్ నిర్వహిస్తుండగా సోమవారం మధ్యాహ్నం మావోయిస్టులు తారసపడ్డారు. లొంగిపోవాలని హెచ్చరించినప్పటికీ మావోయిస్టులు కాల్పులు జరపడంతో భద్రతా దళాలు ఎదురు కాల్పులు జరిపాయి. కాల్పుల్లో ఎవరైనా గాయపడ్డారా? లేదంటే చనిపోయారా? అన్న వివరాలు తెలియాల్సి ఉంది.
Published by: Shiva Kumar Addula
First published: August 19, 2019, 6:47 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading