హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

విజయవాడ శివారులో ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో అగ్నిప్రమాదం.. టైర్ పగిలి చెలరేగిన మంటలు

విజయవాడ శివారులో ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో అగ్నిప్రమాదం.. టైర్ పగిలి చెలరేగిన మంటలు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

విజయవాడ నగర శివారులో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగాయి.

  విజయవాడ నగర శివారులో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగాయి. శ్రీకాకుళం నుంచి విజయవాడ వస్తున్న బస్సు.. ప్రసాదంపాడులో ఎస్వీఆర్ సెంటర్‌కు రాగానే టైర్ పగిలింది. దీంతో బస్సు వెనకభాగంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో బస్సులోపల పొగలు కమ్ముకున్నాయి. దీంత ఏం జరుగుతుందో తెలియకు కొందరు కిటికీ నుంచి బయటకు దూకేశారు. మరోవైపు డ్రైవర్ అప్రమత్తతో వ్యహరించి.. బస్సు ఆపి ప్రయాణికులను దించేశాడు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 35 మంది ప్రయాణికులు ఉన్నట్టుగా తెలుస్తోంది.

  ఈ ప్రమాదం గురించి సమాచారం అందుకున్న ఆటోనగర్ అగ్నిమాపక సిబ్బంది.. ఘటనాస్థలికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. ఈ ఘటనతో ఆ దారిలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. పోలీసులు కూడా ఘటన స్థలానికి చేరుకుని బస్సును పక్కకు నెట్టి.. ట్రాఫిక్ క్లియర్‌ చేశారు. ఇక, ప్రమాదంలో కొందరు ప్రయాణికులకు చిన్న చిన్న గాయాలు అయ్యాయి. బస్సు డ్రైవర్ అతివేగం వల్లనే టైర్ పగిలి మంటలు చెలరేగినట్టుగా సమాచారం.

  Published by:Sumanth Kanukula
  First published:

  Tags: Vijayawada

  ఉత్తమ కథలు