హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

విశాఖలో మరో భారీ అగ్ని ప్రమాదం.. రూ. 2 కోట్ల ఆస్తి నష్టం

విశాఖలో మరో భారీ అగ్ని ప్రమాదం.. రూ. 2 కోట్ల ఆస్తి నష్టం

స్టీల్ ప్లాంట్ లో ఎగిసి పడుతున్న మంటలు (File)

స్టీల్ ప్లాంట్ లో ఎగిసి పడుతున్న మంటలు (File)

విశాఖను వరుస అగ్నిప్రమాదాలు వెంటాడుతున్నాయి. తాజాగా విశాఖ స్టీల్‌ ప్లాంట్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదంలో సుమారు రూ.2 కోట్ల మేర ఆస్తి నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.

విశాఖను వరుస అగ్నిప్రమాదాలు వెంటాడుతున్నాయి. తాజాగా విశాఖ స్టీల్‌ ప్లాంట్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. దీంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. స్టీల్‌ప్లాంట్‌ టీపీపీ-2లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయని సమాచారం. టర్బన్‌ ఆయిల్‌ లీక్‌ కావడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుందని తెలుస్తోంది. ప్రమాదంలో ప్లాంట్‌లోని 1.2 మెగావాట్ల విద్యుత్‌ మోటర్లు దగ్ధం అయ్యాయి. దీంతో సుమారు రూ.2 కోట్ల మేర ఆస్తి నష్టం వాటిల్లినట్లు అంచనా వేస్తున్నారు. అయితే ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.


అగ్ని ప్రమాదానికి దారితీసిన కారణాలపై విచారణ చేస్తున్నన్నట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదం జరగడానికి టర్బన్ ఆయిల్ లీక్ కావడమే కారణమా..? లేక మరే ఇతర ఏమైనా కారణాలు ఉన్నాయా? అన్న కోణంలో స్టీల్ ప్లాంట్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే స్టీల్ ప్లాంట్ చుట్టు పక్కల నివాసం ఉండే ప్రజల్లో ఆందోళన వ్యక్తమైంది. అయితే మంటలు అదుపులోకి రావడం.. ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

First published:

Tags: Andhra Pradesh, Fire Accident, Vizag

ఉత్తమ కథలు