గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రి (జీజీహెచ్) లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా మొదటి అంతస్తులో ఉన్న జనరల్ మెడిసిన్ వార్డులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఉన్నట్టుండి మంటలు వ్యాపించడంతో అప్రమత్తమైన సిబ్బంది వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. ఆక్సిజన్ పైపులు లీకవడంతో జనరల్ వార్డులో మంటలు చెలరేగినట్టు తెలుస్తున్నది. కాగా మంటలు చెలరేగడంతో జనరల్ వార్డులో వందలాది గా ఉన్న రోగులను సిబ్బంది అక్కడ్నుంచి తరలిస్తున్నారు. ఇందులో పలువురు మహిళలు కూడా ఉన్నారు. మంటలు ఎగిసిపడుతుండటంతో రోగులు భయాందోళనలకు గురవుతున్నారు. అయితే రోగులను ఇతర వార్డులకు తరలిస్తున్న సిబ్బంది.. వారికేం ఫర్వాలేదని ధైర్యం చెబుతున్నారు. రోగులతో పాటు వారి బంధువులు కూడా ఆందోళనకు గురవుతున్నారు. మరోవైపు మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు కృషి చేస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Fire Accident, Gunturu