Breaking News: కోవిడ్ కేర్ సెంటర్ లో ప్రమాదం.. ఒకరు మృతి, ఇద్దరికి తీవ్ర గాయాలు

కోవిడ్ కేర్ సెంటర్ లో అగ్ని ప్రమాదం

కోవిడ్ కేర్ సెంటర్ లో ప్రమాదాలు భయపెడుతున్నాయి. అసలే కరోనాతో రోగులకు సేవ చేయడానికి సిబ్బంది భయపెడుతుంటే.. వారిని ప్రమాదాలు వెంటాడుతున్నాయి. తాజాగా ఏపీలో జరిగిన మరో ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి..

  • Share this:
    కోవిడ్ కేర్ సెంటర్లు ప్రమాదానికి నిలయలుగా మారుతున్నాయి. ముఖ్యంగా ఏపీలో ఇటీవల జరుగుతున్న ప్రమాదాలు భయపడెతున్నాడు. ఆక్సిజన్ అందక కొందరు.. ప్రమాదాల కరాణంగా మరికొందరు మృతి చెందడం కలకల రేపుతోంది. విజయవాడ స్వర్ణ పేలస్ లో అగ్ని ప్రమాదం ఘటన విషాదం ఇంకా కళ్ల ముందే కదులుతోంది. అంతకుముందు విజయర్ ఎంవీజీఆర్ ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక కరోనా రోగులు మరణించారు. చిత్తూరులో అయితే మరీ ఘోరం.. ఇలాంటి ఘటనలు సాక్ష్యాలుగా నిలుస్తున్నా కొన్ని చోట్ల నిర్లక్ష్యం వీడడం లేదు. దీంతో ప్రమాదాలు తరచూ జరుగుతూనే ఉన్నాయి. తాజాగా చిత్తూరు జిల్లా చంద్రగిరి తొండవాడ గ్రామపంచాయతీ ప్రమాదం సంభవించింది. తొండవాడ వద్దవున ప్రభుత్వ కొవిడ్ కేర్ సెంటర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది..

    విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. అసలే కరోనా రోగులు ఉండే కేర్ లో విధులు అంటే ప్రాణాలకు తెగించి సేవ చేయడమే.. అలాంటి సెంటర్ లో మరింత అప్రమత్తంగా ఉండాలి. కానీ విద్యుత్ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా కోవిడ్ కేర్ సెంటర్ లో పని చేస్తున్న ముగ్గురు సిబ్బందికి విద్యుత్ షాక్ తగిలింది. 

    షాక్ తీవ్రత ఎక్కువగా ఉండడంతో అక్కడిక్కడే ఒకరు మృతి చెందారు. మరో ఇద్దరికి గాయాలు అయ్యాయి. మృతుడుని తిరుపతి జీవకోనకు చెందిన ఎం.సుబ్రమణ్యంగా గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ప్రమాదానికి కారణాలపై ఆరా తీస్తున్నారు. ఆస్పత్రిలో రోగులు.. ప్రమాద బాధిత కుటుంబ సభ్యులు మాత్రం.. ఆస్పత్రి యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగింది అంటున్నారు. కఠిన చర్యలు తీసుకుని.. తమ కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
    Published by:Nagesh Paina
    First published: