అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం... పక్కనే కరోనా పేషెంట్ల వార్డు...

విజయవాడ కొవిడ్ కేర్ సెంటర్‌లో జరిగిన అగ్నిప్రమాదం దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది. ఇంతలో అనంతపురంలో అలాంటిదే మరొకటి జరిగింది.

news18-telugu
Updated: August 26, 2020, 6:17 AM IST
అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం... పక్కనే కరోనా పేషెంట్ల వార్డు...
అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం (symbolic image)
  • Share this:
అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రిలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన ప్రభుత్వ సిబ్బంది... కేకలు పెట్టారు. దాంతో... డాక్టర్లు అందరూ అలర్ట్ అయ్యారు. ఏమైంది... ఏమైంది... అంటే... రికార్డ్ రూంలో షార్ట్ సర్క్యూట్ అయినట్లుంది... అక్కడ మంటలు వస్తున్నాయి అని అందరికీ అర్థమైంది. ఐతే... రికార్డ్ రూమ్ పక్కనే కరోనా ఐసోలేషన్ వార్డు ఉంది. అయ్య బాబోయ్... అనుకుంటూ... ఆ వార్డులో ఉన్న 30 మంది కరోనా పేషెంట్లను అక్కడి నుంచి హడావుడిగా వేరే వార్డుకు తరలించారు. ఈలోగా... విషయం తెలిసిన ఫైర్ సిబ్బంది... వెంటనే వచ్చారు. వాళ్లు ఉన్నది కూడా దగ్గర్లోనే కావడంతో... త్వరగా వచ్చేందుకు వీలైంది. వచ్చీ రావడంతోనే... వేగంగా స్పందిస్తూ... మంటలపై విరుచుకుపడ్డారు. దాంతో... మంటలు మరింత వ్యాపించకుండా అదుపులోకి వచ్చాయి. దాంతో... మరో విజయవాడ తరహా ప్రమాదం జరగకుండా... పెద్ద ముప్పు తప్పినట్లైంది.

విషయం తెలియగానే వెంటనే అక్కడకు వచ్చారు స్థానిక ఎమ్మెల్యే అనంత వెంకట రామిరెడ్డి, ఎస్పీ ఏసుబాబు. ఇద్దరూ పరిస్థితిని సమీక్షించి... అంతా సర్దుకునేలా చేశారు. మొత్తానికి నిమిషాల్లోనే మంటలు ఆరినట్లైంది. అందరూ ఊపిరి పీల్చుకునేందుకు వీలైంది.

ఈమధ్యే విజయవాడ... స్వర్ణ ప్యాలెస్‌లో మంటలు రావడంతో... అక్కడి కొవిడ్ కేర్ సెంటర్‌లో పేషెంట్లు 11 మంది చనిపోయారు. ఈ ఘటనపై ఆల్రెడీ దర్యాప్తు కొనసాగుతోంది. రాష్ట్రంలోని ఆస్పత్రుల్లో పూర్తి అగ్ని ప్రమాద నియంత్రణ చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుంటే... మరోవైపు తాజా అగ్నిప్రమాదం... మరోసారి హెచ్చరిక పంపినట్లైంది.
Published by: Krishna Kumar N
First published: August 26, 2020, 6:17 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading