తిరుమల బూందీపోటులో అగ్నిప్రమాదం... భారీగా ఎగిసిపడిన మంటలు

తిరుమలలో బుందీపోటులో అగ్నిప్రమాదం జరిగింది. లడ్డూ బుందీ తయారీ కేంద్రంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో మంటల్ని అదుపు చేసేందుకు ఫైరింజన్లు రంగంలోకి దిగాయి.

news18-telugu
Updated: December 8, 2019, 3:10 PM IST
తిరుమల బూందీపోటులో అగ్నిప్రమాదం... భారీగా ఎగిసిపడిన మంటలు
Video : తిరుమల బూందీపోటులో అగ్నిప్రమాదం..
  • Share this:
తిరుమలలో బూందీపోటులో అగ్నిప్రమాదం జరిగింది. లడ్డూ బుందీ తయారీ కేంద్రంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. 19వ పొయ్యి వద్ద మంటలు చెలరేగాయి. పై కప్పు గొడలకు నెయ్యి జిడ్డు అధికంగా ఉండటంతో మంటలు త్వరగా వ్యాపించాయి. దీంతో మంటల్ని అదుపు చేసేందుకు ఫైరింజన్లు రంగంలోకి దిగాయి. తిరుమల బూందీపోటులోఇదివరకే చాలా సార్లు ప్రమాదాలు జరిగాయి. అయితే ఇక్కడ నిత్యం లక్షల సంఖ్యలో లడ్డూలు తయారు చేస్తుంటారు. లడ్డూలు తయారీ చేసే కేంద్రం కొంచెం చిన్నదిగా ఉండటంతో.. దీనికోసం పెద్ద భవనం కేటాయించాలని చాలామంది డిమాండ్ కూడా చేస్తున్నారు.


First published: December 8, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>