టాయిలెట్ సీట్ కవర్‌పై హిందూ దేవుళ్లు... అమెజాన్‌పై కేసు నమోదు...

Boycott Amazon : ఈ అంశంపై అమెజాన్‌ను ఇండియాలో బహిష్కరించాలంటూ... చాలా మంది సోషల్ మీడియాలో బాయ్‌కాట్ అమెజాన్ అంటూ పోస్టులు పెడుతున్నారు. ఇందులో తమ తప్పేమీ లేదనీ, అమ్మకందారుల వల్లే ఇలా జరిగిందని అమెజాన్ ప్రతినిధి అంటున్నారు.

Krishna Kumar N | news18-telugu
Updated: May 18, 2019, 8:36 AM IST
టాయిలెట్ సీట్ కవర్‌పై హిందూ దేవుళ్లు... అమెజాన్‌పై కేసు నమోదు...
అమెజాన్ (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
అమెరికా ఆన్‌లైన్ ఈ-కామర్స్ వెబ్‌సైట్ అమెజాన్‌పై కేసు నమోదైంది. రగ్గులు, టాయిలెట్ సీట్ కవర్లపై హిందూ దేవుళ్ల బొమ్మలు ఉండటం తీవ్ర కలకలం రేపింది. అమెరికాలోని అమెజాన్ వెబ్‌సైట్‌లో కనిపించిన ఆ ఫొటోలను చూసి షాకైన భారతీయులు... హిందువుల మనోభావాలు దెబ్బతినేలా చేశారని కంప్లైంట్ ఇచ్చారు. కేసు నమోదు చేసిన నోయిడా పోలీసులు... నోటీసులు పంపారు. ఇండియన్స్‌ని అవమానపరుస్తున్న అమెజాన్‌లో ఎందుకు వస్తువులు కొనాలంటూ... అమెజాన్‌ను ఇండియాలో బహిష్కరించాలంటూ... చాలా మంది సోషల్ మీడియాలో బాయ్‌కాట్ అమెజాన్ అంటూ పోస్టులు పెడుతున్నారు.

కంపెనీ ప్రతినిధి మాత్రం ఇందులో తమ తప్పేమీ లేదంటున్నారు. తమ వెబ్‌సైట్‌లో సెల్లర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని చెబుతున్నారు. కంపెనీ గైడ్‌లైన్స్ ప్రకారం సెల్లర్లు నడుచుకోకపోతే, చర్యలు తీసుకుంటామని తెలిపారు. అభ్యంతరకరమైన వాటిని తొలగిస్తామన్నారు.

అమెజాన్ వెబ్‌సైట్‌లో తరచుగా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. ఇదివరకు డోర్ మ్యాట్లపై ఇండియా జాతీయ జెండాను ముద్రించి అవమానించారు. మహాత్మాగాంధీ ఫొటోను చెప్పులపై ముద్రించారు. అలాగే హిందూ దేవుళ్ల ఫొటోలను కూడా అవమానించారు. ఇలాంటివి రిపీట్ అవ్వకుండా చర్యలు తీసుకోవాలని కంప్లైంట్ చేసిన వికాశ్ మిశ్రా కోరారు. ఇలాంటి అంశాలు హింసకు దారితీసే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

 ఇవి కూడా చదవండి :

ఎవరు గెలుస్తారు..? కోట్లు సంపాదిస్తున్న జ్యోతిష్యులు...

లగడపాటి సర్వే సిద్ధం... ఎగ్జిట్‌ పోల్స్ ఏం చెప్పినా...రేపు సాయంత్రం ఎగ్జిట్ పోల్స్... కరెక్టే చెబుతాయా..?

రూ.10 నాణేనికి ఓ దండం... వద్దంటున్న ప్రజలు...

First published: May 18, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>