హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

RRR Vs YCP MP: నా పైన రెండు సీబీఐ కేసులే.. అధినేతపై వందల కేసులు.. లోక్ సభలో వైసీపీ ఎంపీల డైలాగ్ వార్

RRR Vs YCP MP: నా పైన రెండు సీబీఐ కేసులే.. అధినేతపై వందల కేసులు.. లోక్ సభలో వైసీపీ ఎంపీల డైలాగ్ వార్

MP raghurama vs mp mithun

MP raghurama vs mp mithun

RRR Vs YCP MP: లోక్ సభలో ఇద్దరు అధికార పార్టీ ఎంపీల మధ్య పెద్ద వారే జరిగింది. అయితే అందులో ఒకరు రెబల్ ఎంపీ రఘురామ రాజు అయితే.. మరో ఎంపీ మిథున్ రెడ్డి. సభా వేదికగా ఇద్దరూ ఢీ అంటే ఢీ అన్నారు. తగ్గేదే లే అంటూ మాటల దాడికి దిగారు. ఇంతకీ ఏ అంశంపై ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగిదంటే..?

ఇంకా చదవండి ...

Raghuram Raju Vs Mithunreddy: అమరావతి  రైతుల ఉద్యమ (Amaravati farmers protest) సెగ లోక్ సభను తాకింది. రైతుల మహా పాదయాత్రకు పోలీసులు అడ్డంకులు కల్పించడాన్ని జీరో అవర్ లో ఎంపీ రఘురామ రాజు  (MP Raghuram Raju)లేవనెత్తారు. గాంధేయ పద్ధతిలో రైతులు చేస్తున్న మహాపాదయాత్ర (Mahapadayatra)ను అడ్డుకోవడం అన్యాయమని రఘురామ పేర్కొన్నారు. ఏపీ హైకోర్టు (AP Highcourt) నుంచి అనుమతులు ఉన్నా పోలీసులు అడ్డుకోవడం దురదృష్టకరమన్నారు. రైతులు రాజధాని కోసం 33 వేల ఎకరాలు స్వచ్ఛందంగా ఇచ్చారన్నారు. అలాంటి రైతులను పోలీసులు తీవ్రంగా హింసిస్తున్నారని రఘురామ పేర్కొన్నారు. శాంతి భద్రతలు రాష్ట్ర పరిధిలోని అంశమైనా అక్కడ క్షీణించాయన్నారు. ప్రజల ప్రాథమిక హక్కులను కూడా పోలీసులు హరిస్తున్నారన్నారు. రఘురామ మాట్లాడుతున్న సమయంలో లోక్‌సభా పక్ష నేత మిధున్ రెడ్డి (Mithun Reddy) ఖండించారు. రఘురామ ప్రసంగాన్ని వైసీపి ఎంపీలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. సీబీఐ కేసుల నుంచి బయటపడేందుకు ఎంపీ రఘురామ అధికార బీజేపీలో చేరేందుకు తహతహలాడుతున్నారని ఎంపీ మిథున్ రెడ్డి వ్యాఖ్యానించారు.ఆ వెంటనే రఘురామ మరో కౌంటర్ వేశారు. తన పైన రెండు సీబీఐ కేసులే ఉ న్నాయని... సీఎం జగన్‌ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy) పైన వంద సీబీఐ కేసులున్నాయని.. ముందు వాటి సంగతి తేల్చాలని ఎంపీ రఘురామ సెటైర్ వేశారు.

రఘు రామ రాజు మాట్లాడుతుండగానే మిథున్ రెడ్డి సహా ఇతరు ఎంపీలు ఆయన వ్యాఖ్యలకు అడ్డు తగిలారు. రఘురామ బ్యాంకులను మోసం చేశారని. వాటి నుంచి బయటపడాలనే ఆశతో.. కేంద్రంలోని అధికార పార్టీలో చేరే ప్రయత్నం చేస్తున్నారు అంటూ మిథున్ రెడ్డి విమర్శించయారు. అతడు తమ పార్టీ నుంచి ఎంపీగా గెలిచి.. తరువాత బ్యాంకులను మోసం చేశాడని.. ఆ కేసుల నుంచి బయటపడటానికి పార్టీ ఫిరాయించే ప్రయత్నం చేస్తున్నారని మిథున్ మండిపడ్డారా?.. . రఘురామకృష్ణరాజుపై కేసులను వీలైనంత త్వరగా తేల్చండి. భారత్‌ థర్మల్‌ పేరుతో ఆయన తీసుకున్న వేల కోట్ల రుణాలపై సమగ్ర దర్యాప్తు చేయాలని’’ మిథున్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.

ఇదీ చదవండి: విశాఖ అందాలను 360 డిగ్రీల్లో చూడాలని ఉందా..? లండన్ ఐ రా రమ్మంటోంది?

వైసీపీ రెబల్ ఎంపీ, వైసీపీ ఎంపీలు ఒకరి పై ఒకరు మాటల తూటాలు విసురుకున్నారు కానీ.. ఒకరి పరవు ఒకరు లోక్ సభ వేదికగా తీసుకున్నారు. ఇటు వైసీపీలు ఎంపీలు. అటు రఘురామరాజు ఇద్దరు సీబీఐ కేసులు, ఇతర కేసుల విషయాన్ని సభ వేదికగా బయట పెట్టుకున్నారు. త్వరగా దర్యాప్తు చేయాలని కూడా కోరారు. ఒకే పార్టీ నుంచి పోటీ చేసిన ఇద్దరూ ఇలా తిట్టుకోవడంతో.. జాతీయ నాయకులంతా ఆసక్తిగా వారి గొడవను తిలకించారు. మొత్తానికి అందరి ముందు ఒకరి పరువు మరొకరు తీసుకున్నట్టు అయ్యింది.

(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)

First published:

Tags: Andhra Pradesh, AP News, AP Politics, Ycp

ఉత్తమ కథలు