High court judges Transfer: దేశ వ్యాప్తంగా హైకోర్టు జడ్జీల బదిలీలు.. తెలుగు రాష్ట్రాలకు వస్తున్న కొత్త జడ్జీలు ఎవరంటే..?

సుప్రీం కోర్టు (File Photo: Supreme Court)

సుప్రీంకోర్టు కొలీజియం (supreme court collegium) సిఫార్సులను ఆమోదిస్తూ కేంద్ర ప్రభుత్వం (Central government) ఈ నిర్ణయం తీసుకుంది. మొత్తం 17 మందిని బదిలీ చేయాల్సి ఉండగా అందులో ఇద్దరిని మినహాయించి మిగతా 15 మందిని బదిలీ (Transfer) చేసింది.

  • Share this:
    దేశవ్యాప్తంగా హైకోర్టు జడ్జి (High court judges)ల బదీలీ జరిగింది. మొత్తం 15 మంది జడ్జీలను బదిలీ చేసింది. సుప్రీంకోర్టు కొలీజియం (supreme court collegium) సిఫార్సులను ఆమోదిస్తూ కేంద్ర ప్రభుత్వం (Central government) ఈ నిర్ణయం తీసుకుంది. మొత్తం 17 మందిని బదిలీ చేయాల్సి ఉండగా అందులో ఇద్దరిని మినహాయించి మిగతా 15 మందిని బదిలీ (Transfer) చేసింది. తాజా నిర్ణయంతో ఏపీ హైకోర్టు (Andhra Pradesh high court)కు ఇద్దరు న్యాయమూర్తులు (judges) బదిలీయ్యారు.. ఏపీ హైకోర్టు జడ్జిలుగా జస్టిస్‌ రవినాథ్‌ తిలహరి (ravinath tilhari), ఆషానుద్దీన్‌ అమానుల్లా (Ahsanuddin Amanullah) నియమితులు కాగా.. తెలంగాణ హైకోర్టు (Telangana high court) న్యాయమూర్తిగా జస్టిస్‌ ఉజ్జల్‌ భయాన్‌ (Ujjal bhuyan) నియమితలయ్యారు.

    465 న్యాయమూర్తుల పోస్టులు ఖాళీ..

    న్యాయశాఖ ప్రకారం ఈ నెల 1వ తేదీనాటికి మొత్తం 25 హైకోర్టుల్లో 465 న్యాయమూర్తుల పోస్టులు (posts) ఖాళీ (empty)గా ఉన్నాయి. ఒక్క అలహాబాద్ హైకోర్టులోనే 68 ఖాళీలున్నాయి. పంజాబ్ (Punjab), హర్యానాలో 40, కలకత్తాలో 36 ఖాళీలున్నాయి. అలహాబాద్ హైకోర్టు (Allahabad high court) కోసం 16 మందిని, కేరళ (Kerala) హైకోర్టుకు 8 మందిని, కలకత్తా, రాజస్థాన్ (Rajasthan) హైకోర్టులకు ఆరుగురి చొప్పున నియమించాలని తాజా ప్రతిపాదనలో కొలీజియం పేర్కొంది. వీరితోపాటు గౌహతి, జార్ఖండ్ (Jharkhand) హైకోర్టుకు ఐదుగురి చొప్పున, పంజాబ్, హర్యానా (Haryana)లకు నలుగురి చొప్పున, చత్తీస్‌గఢ్ హైకోర్టుకు ఇద్దరిని, మధ్యప్రదేశ్ హైకోర్టుకు ఒకరిని నియమించాలని తెలిపింది.

    ఇది కూడా చదవండి:  డ్రగ్స్​ కేసులో కొనసాగుతున్న సంచలనాలు.. క్రూయిజ్​ షిప్​లో మరోసారి అధికారులు సోదాలు.. మరో ఎనిమిది మంది అరెస్టు..




    జస్టిస్‌ రామచంద్రరావు బదిలీ ..

    అయితే తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ రామచంద్రరావు (Rama Chandra rao) పంజాబ్‌ హైకోర్టుకు బదిలీ అయ్యారు. హైకోర్టుల్లో న్యాయమూర్తులను నియమించడానికి ఆగస్టు 25, సెప్టెంబర్ 1న కొలీజియం సభ్యులు సమావేశమై 112 మంది పేర్లను పరిశీలించారు. ఇందులో నుంచి 68 మందిని ఎంపిక చేసి కేంద్రానికి సిఫారసు (proposals) చేశారు. 68 మందిలో 44 మంది బార్ (Bar) సభ్యులను ఎంపిక చేసుకోగా మిగతా వారు జ్యుడిషియల్ అధికారులు. సుప్రీంకోర్టు కొలీజియం (supreme court collegium) సిఫార్సులను ఆమోదిస్తూ కేంద్ర ప్రభుత్వం (Central government) ఈ నిర్ణయం తీసుకుంది.

    ఇవి కూడా చదవండి :

    పన్ను ఎగవేతదారుల విషయంలో పండోరా పేపర్స్​ జాబితాపై కేంద్రం సంచలన ప్రకటన.. ఏం చెప్పిందంటే


    నీళ్లు ఎక్కువగా తాగితే నిత్య యవ్వనంగా కనిపిస్తారా? ముఖంపై ముడుతలు పోవాలంటే ఏం చేయాలి?

    ఇవి కూడా చదవండి:  తిన్న ఆహారం అరగట్లేదా? అయితే రోజూ ఉదయాన్నే ఇలా చేయండి.. సమస్యను దూరం చేసుకోండి

    ముఖంలో కాంతి, తేజస్సు కావాలా ? మొటిమలు తగ్గిపోవాలా? అయితే ఇలా చేయండి
    Published by:Prabhakar Vaddi
    First published: