చిత్తూరు జిల్లా పలమనేరు మండలం మండిపేటలోని అటవీ ప్రాంతంలో ఇటీవల ఓ ఆడ ఏనుగు మృతి చెందింది. అనారోగ్య కారణాలతోనే ఏనుగు మృతి చెంది ఉంటుందని అధికారులు భావించారు. కానీ పోస్టుమార్టమ్ రిపోర్టులో ఏనుగు మృతికి అసలు కారణం బయటపడింది. ఓ మగ ఏనుగు లైంగిక దాడి వల్లే ఆడ ఏనుగు మృతి చెందిందని రిపోర్టులో తేలింది.ఏనుగు చనిపోయిన విషయాన్ని తొలుత అక్కడి పశువుల కాపర్లు గుర్తించారు.ఆ సమయంలో అక్కడే ఓ పిల్ల ఏనుగు కూడా కనిపించిందని అధికారులతో చెప్పారు. పశువుల కాపర్లు ఇచ్చిన సమాచారం మేరకు అక్కడికి వెళ్లి చూడగా ఏనుగు చనిపోయి కనిపించింది.అనారోగ్యంతోనే చనిపోయి ఉంటుందని అధికారులు భావించారు. అనంతరం పోస్టుమార్టమ్ రిపోర్ట్ కోసం ఏనుగు మృతదేహాన్ని తరలించారు.రిపోర్టులో లైంగిక దాడి వల్లే అది మృతి చెందినట్టు తేలింది.
Published by:Srinivas Mittapalli
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.