Father's Day 2020| ఫాదర్స్ డేను ఘనంగా జరుపుకునేందుకు అమెరికాలో తెలుగు సంఘాలు సిద్ధమయ్యాయి. ఐతే కరోనా నేపథ్యంలో ఆన్లైన్ ద్వారా నిర్వహించనున్నాయి. తానా (తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా) జూన్ 21 ఫాదర్స్ డే కార్యక్రామాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించనుంది. ఈ వేడుకలకు సిరివెన్నెల సీతారామశాస్త్రి, తనికెళ్ల భరణి ముఖ్య అతిథులుగా హాజరవుతారని తానా అధ్యక్షుడు జయశేఖర్ తాళ్లూరి, ప్రపంచ సాహిత్య వేదిక సారథి ప్రసాద్ తోటకూర తెలిపారు. ఫాదర్స్ డే నేపథ్యంలో ‘ఘనుడు నాన్న- త్యాగధనుడు నాన్న’ అనే అంశంపై కవితా పోటీలు నిర్వహించామని..విజేతలకు జూన్ 21న బహుమతులను అందజేస్తామని వెల్లడించారు. ప్రథమ బహుమతిని హైదరాబాద్‌కు చెందిన మౌనశ్రీ మల్లిక్, ద్వితీయ బహుమతిని ఖమ్మంకు చెందిన జయశ్రీ, తృతీయ బహుమతిని వరంగల్‌కు చెందిన ప్రొఫెసర్ రామ చంద్రమౌళి గెలుచుకున్నారని తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.